Devayani: హీరోయిన్ దేవయాని కూతుర్లు..ఎంత అందమంటే.?

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో ఒక ఊపు ఊపింది హీరోయిన్ దేవయాని. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో భారీ హీట్ కొట్టిన మూవీస్ సుస్వాగతం చిత్రంలో ఈ హీరోయిన్ నటించింది


Published Aug 03, 2024 12:30:00 PM
postImages/2024-08-03/1722665667_deva.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో ఒక ఊపు ఊపింది హీరోయిన్ దేవయాని. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో భారీ హీట్ కొట్టిన మూవీస్ సుస్వాగతం చిత్రంలో ఈ హీరోయిన్ నటించింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో దేవయాని పేరు ఎక్కడికో వెళ్లిపోయింది.. తెలుగులో ఇది మొదటి సినిమా అయినప్పటికీ  అప్పటి దర్శక నిర్మాతల కళ్ళల్లో పడింది.

కానీ ఈమె ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలకు ఒప్పుకోకపోవడంతో అవకాశాలు రాలేదట. దీంతో కొన్ని సినిమాల్లో సహాయనటిగా మాత్రమే చేయగలిగింది. అలాంటి దేవయాని మహేష్ బాబు నటించిన నాని చిత్రంలో తల్లి పాత్రలో మెరిసింది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించి  కోలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ తో లవ్ లో పడి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకుంది.  

అలాంటి ఈ ముద్దుగుమ్మకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వారి పేర్లు ప్రియాంక, ఇనియా. ప్రస్తుతం ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో దేవయాని కూతుర్లని చూసి ఫ్యాన్స్  ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ హీరోయిన్ అందానికి ఏమాత్రం తక్కువ లేకుండా ఉన్నారని,అమ్మ అందాన్ని పునికి పుచ్చుకొని బంగారు తారల్లా మెరిసిపోతున్నారని  కామెంట్లు పెడుతున్నారు.

అయితే దేవయాని  తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అరవింద సమేత, జనతా గ్యారేజ్ చిత్రాల్లో కనిపించి ఆ తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పిందట. ప్రస్తుతం టీచర్ గా పని చేస్తున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కూతుర్లను పరిచయం చేయడంతో వాళ్లని చూసి అంతా షాక్ అయిపోతున్నారు.

https://www.instagram.com/reel/C2FqLFbtjEr/?utm_source=ig_embed&ig_rid=904c4aff-ad8c-49d3-a31c-231b1c212e0a

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan priyanka devayani iniya suswagatham-movie

Related Articles