ప్రాబ్లమ్ షాంపూది కాదు...వాడే మనదే అంటున్నారు ఎక్సపర్ట్స్. బ్యూటీ కోసం చూస్తున్నాం కాని షాంపూని కరెక్ట్ గా వాడడం లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు షాంపూ ఎందుకు వాడతాం...జుట్టు మురికి పోవడానికి ..చాలా ఫ్లోయిగా ..గాలికి ఎగిరి అందంగా కనిపించడానికి .. ఓ అక్కా...జుట్టు ఉంటే ఎగరడమో..జడ వేసుకోవడమో చేస్తాం..ఇప్పుడు జుట్టు రాలడమే పెద్ద సమస్య అంటారా. అవను వందలో దాదాపు 80 శాతం మందికి ఇదే సమస్య. ప్రాబ్లమ్ షాంపూది కాదు...వాడే మనదే అంటున్నారు ఎక్సపర్ట్స్. బ్యూటీ కోసం చూస్తున్నాం కాని షాంపూని కరెక్ట్ గా వాడడం లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్.
* ఫస్ట్ మీరు షాంపూను అతిగా వాడడం మానేయండి. లేదా వాటర్ లో డెల్యూట్ చేసి వాడండి.
* రోజు షాంపూ చెయ్యాల్సిందే తప్పదు..అంటే కనుక మీ జుట్టుకు మీరు దానికి తగినంత మాయిశ్చరైజర్ ను ఇవ్వండి . అంటే ఆయిల్ కాని ...ఆముదం కాని నువ్వుల నూనె కాని రాయడం వల్ల జుట్టు షాంపూ లో కెమికల్స్ కు త్వరగా ఎఫెక్ట్ కాదు.
* ఎక్కువ శాతం PH లెవల్స్ ఎక్కువగా ఉన్న షాంపూ వాడడం ఆపితే ...చుండ్రు రాదు దీని తో మీ జుట్టు ఊడదు. బేబీ షాంపూస్ వాడండి. ట్రస్ట్ మీ భలే వర్కవుట్ అవుతుంది.
* మీ జుట్టు కు కనీసం నెలలో ఓ సారైనా ...స్ట్రీమ్ పెట్టుకొండి.. ఏదైనా మాస్క్ వేసుకొండి . హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల హెల్దీ హెయిర్ ఉంటుంది.
* గోరు వెచ్చని నీరు తల స్నానానికి వాడండి. స్నానం చేస్తున్నపుడు దువ్వెనతో కాని హెడ్ మాసాజర్ తో కాని జుట్టు దువ్వుతూ చేస్తే తలలో చుండ్రు పోతుంది.
ఇలా ప్రయత్నిస్తే చాలా వరకు హెయిర్ ఫాల్ ను తగ్గించవచ్చు. చాలా వరకు హెల్దీ హెయిర్ అనేది జెనిటికల్ గా కూడా ఉండాలి . అపుడే జుట్టు అందంగా ఉంటుంది. హార్మోన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే అప్పుడు జుట్టు బాగుంటుంది.