చాలామంది సెలబ్రిటీల పిల్లలకు కూడా ఆమె కేర్ టేకర్ గా పనిచేసింది. షూటింగులు, ఇతర బిజినెస్ పనులతో బిజీగా ఉండే సెలెబ్రిటీల పిల్లల ఆలనా పాలనా చూసుకనేది సావిత్రే.
న్యూస్ లైన్ డెస్క్ : గేమ్ ఛేంజర్ సినిమా లేటెస్ట్ అప్డేట్ చెప్పి ఫ్యాన్స్ లో జోష్ పెంచిన రామ్ చరణ్ ఎక్కువ సమయం ముంబైలోనే ఉంటున్నాడు. ఉపాసన, క్లీంకారతో కలిసి నిత్యం ఆయన ట్రావెల్ చేయాల్సి వస్తోంది. అయతే.. క్లీంకార ఫొటోలు గానీ, వీడియోలు గానీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. రామ్ చరణ్, ఉపాసనలతో పాటు క్లీంకారను ఎత్తుకొని ఒక ఆయా కనిపిస్తుంది గమనించారా? ఆమె ఎవరో కాదు.. క్లీంకార కేర్ టేకర్. సెటబ్రిటీ కేర్ టేకర్ గా ఆమెకు ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. పేరు.. సావిత్రి. బాలీవుడ్ స్టార్లు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ల పెద్ద కొడుకు తైమూర్ ఖాన్ కి ఈమె కేర్ టేకర్ గా పనిచేసింది. ఇంకా చాలామంది సెలబ్రిటీల పిల్లలకు కూడా ఆమె కేర్ టేకర్ గా పనిచేసింది. షూటింగులు, ఇతర బిజినెస్ పనులతో బిజీగా ఉండే సెలెబ్రిటీల పిల్లల ఆలనా పాలనా చూసుకనేది సావిత్రే.
ఇప్పుడు తాజాగా టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ఆమెను క్లీంకారకు కేర్ టేకర్ గా నియమించుకున్నారు. మార్కెట్లో ఆమెకు మంచి డిమాండ్ ఉండటంతో.. పైగా స్టాఫ్ నర్స్ గా చేసిన అనుభవం కూడా ఉండటంతో రామ్ చరణ్ సావిత్రిని కేర్ టేకర్ గా నియమించుకునేందుకు మొగ్గు చూపారట. నెల జీతంగా.. రూ.లక్సా 75 వేలు చెల్లిస్తున్నారట. అంతేకాదు.. ఎక్స్ ట్రా టైమ్ పని చేస్తే దానికి కూడా జీతం ఇస్తారని.. సెలవులు లేకుండా పని చేయాలి కాబట్టి అందుకు తగ్గ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
ఆయాగా ఉండేందుకు అంత జీతం ఎందుకు అనే డౌట్ వచ్చే ఉంటుంది. అయితే.. ఆమె అందరిలాంటి ఆయా కాదు. చిన్న పిల్లల విషయంలో వారి ఆరోగ్యం విషయంలో వీరికి పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు సావిత్రి. కొన్ని ప్రైవేట్, కార్పోరేట్ కంపెనీలు కొంతమంది నర్సులకు, డాక్టర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఇలా సెలెబ్రిటీల పిల్లలకు కేర్ టేకర్ గా నియమిస్తున్నారు.