హైకోర్టు స్టే ఇవ్వడం పూర్తిగా అవాస్తవం. N-కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదని ఆయన అన్నారు. FTLలో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేశాం. చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారని తెలిపారు. N-కన్వెన్షన్ రిక్వెస్ట్‌ను గతంలోనే అధికారులు తిరస్కరించారని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని అన్నారు. హైకోర్టు స్టే ఇవ్వడం పూర్తిగా అవాస్తవం. N-కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదని ఆయన అన్నారు. FTLలో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేశాం. చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారని తెలిపారు. N-కన్వెన్షన్ రిక్వెస్ట్‌ను గతంలోనే అధికారులు తిరస్కరించారని వెల్లడించారు.
అందుకే కన్వెన్షన్‌లో పూర్తిగా కట్టడాలను నేలమట్టం చేశామని అన్నారు. హైడ్రా, GHMC, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది దీన్ని కూల్చివేశారని తెలిపారు. చెరువులోని FTLలో ఎకరా 12 గుంటలు N-కన్వెన్షన్ నిర్మించారని ఆయన అన్నారు. బఫర్ జోన్‌లోని 2 ఎకరాల 18 గుంటల్లో N-కన్వెన్షన్ నిర్మించారని అన్నారు. GHMC నుంచి కన్వెన్షన్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులూ లేవని రంగనాథ్ అన్నారు.