ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్‌కు వెళ్తే.. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, డయాలసిస్ చేయాలని డాక్టర్లు చెప్పారని తెలిపాడు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని తెలిపాడు.
న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో నవ్వులు పూయించిన కమెడియన్ ఇప్పుడు కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఫిష్ వెంకట్ అంటే తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. కామెడీ విలన్ పాత్రలు అనగానే మొదట గుర్తొచ్చే వ్యక్తి అతను. అయితే, గత కొంత కాలంగా సినిమాలకు ఆయన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు చాలా దీనంగా మారింది. ఆరోగ్యం బాగాలేదని.. ఎవరైనా ఆదుకోవాలని అగిడే పరిస్థితికి చేరుకున్నాడు.
ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్‌కు వెళ్తే.. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, డయాలసిస్ చేయాలని డాక్టర్లు చెప్పారని తెలిపాడు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని తెలిపాడు. దీనికి తోడు బీపీ, షుగర్ కూడా వచ్చాయని చెప్పుకొచ్చాడు. దీంతో కాలికి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపాడు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో సినిమాల్లో ఛాన్స్ వచ్చినా చేయలేకపోతున్నానని అన్నాడు. ఎవరైనా తనకు సహాయం చేయాలని ఆయన వేడుకున్నాడు. తాను ఎందరికో సాయం చేశానని, ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకున్నారు.