గ్యాంబ్లింగ్, మోసాలు, నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వం విచారణ చేస్తోంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టెలిగ్రామ్ యాప్ ను ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అవుతుంది. గేమ్ యాప్స్ లో ..బెట్టింగ్స్ లో వింటూనే ఉన్నాం. భారత ప్రభుత్వం కూడా టెలిగ్రామ్ యాప్‌పై దృష్టి సారించింది. ఇండియాలో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తుందట. భారత్ యువత టెలిగ్రామ్ వల్ల ప్రభావితం అవుతున్నారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇందుకోసమే టెలిగ్రామ్ ను బ్యాన్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట భారత్ అధికారులు.
గ్యాంబ్లింగ్, మోసాలు, నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వం విచారణ చేస్తోంది. నిజానికి జరుగుతున్నాయనేది అందరికి తెలిసిన విషయమే..కాని ఆధారాలు కావాలిగా ..ఆధారాలు దొరికితే బ్యాన్ కన్ఫర్మ్ అయినట్టే.కేంద్ర హోం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల నేతృత్వంలో ఈ యాప్‌పై విచారణ జరుగుతోంది. సెక్షన్ 14C ప్రకారం దర్యాప్తు సాగుతోంది. గత కొన్నేళ్లుగా టెలిగ్రామ్‌లో క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచ్చలవిడిగా పోర్న్ వీడియోల అప్‌లోడింగ్, షేరింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ కార్యకలాపాలు ఈ యాప్ ద్వారా జరుగుతున్నట్లు పక్కా సమాచారం . దీనికి తగిన ఆధారాలు దొరికితే ..బ్యాన్ చేసేస్తారంతే.
పైరసీ మూవీలకూ టెలిగ్రామే అడ్డాగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ అక్రమ రవాణా, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌ను 50% కూడా ఫాలోఅవ్వడం లేదని టెలిగ్రామ్‌పై ఆరోపనలు ఉన్నాయి. ఈ దర్యాప్తు కూడా నామమాత్రమేనట..బ్యాన్ పక్కా అంటున్నారు నిపుణులు.