Megastar : చూస్తుండగానే బుక్కైపోయిన ఇంద్ర టికెట్స్.. మెగా క్రేజ్ అంటే అదీ..

వచ్చే గురువారం (ఆగష్టు 22)న ఇంద్ర రిరీలీజ్ ప్రకటించిన వైజయంతీ మూవీస్ ఆన్ లైన్ వేదికగా బుకింగ్స్ ఓపెన్ చేసింది. కాగా.. యూత్, మెగాస్టార్ అభిమానులు చూస్తుండగానే టికెట్ల కోసం ఎగబడ్డారు.


Published Aug 18, 2024 01:37:50 PM
postImages/2024-08-18/1723968470_Indra.jpg

న్యూస్ లైన్ డెస్క్ : మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ హిట్ మూవీ ఇంద్ర సినిమా మళ్లీ విడుదల కానుంది. ఇందుకోసం ఇప్పటికే వైజయంతీ మూవీస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే గురువారం (ఆగష్టు 22)న ఇంద్ర రిరీలీజ్ ప్రకటించిన వైజయంతీ మూవీస్ ఆన్ లైన్ వేదికగా బుకింగ్స్ ఓపెన్ చేసింది. కాగా.. యూత్, మెగాస్టార్ అభిమానులు చూస్తుండగానే టికెట్ల కోసం ఎగబడ్డారు.

ఇప్పటి వరకు రిరీలీజ్ ప్రకటించిన అన్ని సినిమాల కంటే ఇంద్ర మూవీ అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే చాలా చోట్ల హౌజ్ ఫుల్ బుకింగ్స్ అయిపోయాయట. హైదరాబాద్ లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇప్పటికే టికెట్లు సోల్డవుట్ అని థియేటర్ యజమానులు ప్రకటించారు. కేవలం 24 గంటల్లోనే 12 వేల టికెట్లు అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాల్లో టాక్. ఈ లెక్కన చూస్తే.. ఈ-బుకింగ్ తోనే రూ.కోటి వరకు గ్రాస్ కలెక్షన్స్ పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. టికెట్లకు వస్తున్న డిమాండ్ చూసి వైజయంతీ మూవీస్ షోలు పెంచే దిశగా ఆలోచనలు చేస్తోంది. 22 ఏళ్ల తర్వాత కూడా మెగాస్టార్ మూవీకి అంతే క్రేజ్ ఉండటం టాలీవుడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : ap-news ts-news chiranjeevi mega-family movie-news cinema-news indra-movie-re-release

Related Articles