i phone 15 plus: 17వేలకే ఐఫోన్.. అమెజాన్ అద్భుత ఆఫర్.!

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి మొబైల్ కంపెనీలలో  రారాజుగా నిలిచిన మొబైల్ కంపెనీ ఐఫోన్.  ఈ ఫోన్ బ్రాండ్ ఇమేజ్ ఐకాన్ గా వాడుతారు.  అలాంటి ఐఫోన్ అద్భుతమైన ఫీచర్లతో మన డేటా


Published Aug 17, 2024 04:52:23 PM
postImages/2024-08-17/1723893743_iphone.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి మొబైల్ కంపెనీలలో  రారాజుగా నిలిచిన మొబైల్ కంపెనీ ఐఫోన్.  ఈ ఫోన్ బ్రాండ్ ఇమేజ్ ఐకాన్ గా వాడుతారు.  అలాంటి ఐఫోన్ అద్భుతమైన ఫీచర్లతో మన డేటా భద్రతతో పాటు అనేక రకాల ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. అందుకే యూత్ ఎక్కువగా ఈ ఫోన్ కొనడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు.  ఈ విధంగా అద్భుత ఫీచర్లు ఈ ఫోన్ లో ఉండడంతో  పెరిగిన డిమాండ్ కు తగ్గట్టుగా  ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తూ  ఫోన్ ధరలు కూడా పెంచుతుంది.

సాధారణ మధ్యతరగతి ప్రజలు ఈ ఐఫోన్ కొనాలంటే కష్టతరమే.  అలాంటి వారికోసం ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. రూ:17,870కే ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ ను మనకు అందజేస్తుంది. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ ఇతర వివరాలు చూద్దాం.  యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ 128 జీబీ వేరియంట్ అసలు ధర రూ:89,600 అయితే అమెజాన్ లో 10% సాధారణ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది.

రూ:80,600 అన్నమాట. మీ యొక్క పాత ఐఫోన్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల  భారీ తగ్గింపు పొందవచ్చు.అంతేకాకుండా అమెజాన్ పే, ఐసిఐసిఐ, బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కస్టమర్లు 4,030 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ విధంగా అన్ని ఆఫర్లు పోను ఈ మొబైల్ రూ:17,870కి మీరు సొంతం చేసుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu apple-phone i-phone-15plus offer

Related Articles