Lavanya:చిత్రాల్లో కూడా లావణ్య పాత్ర ఉందా..కేసులో కొత్త ట్విస్ట్.!

ప్రస్తుతం సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ ఏదయ్యా అంటే అది లావణ్య, రాజ్ తరుణ్ సంబంధించినటువంటి వ్యవహారమే అని చెప్పవచ్చు. రాజ్ తరుణ్ తనను కొన్ని సంవత్సరాల పాటు వాడుకొని


Published Aug 04, 2024 11:34:29 AM
postImages/2024-08-03/1722690465_lavnayarajtarun.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ ఏదయ్యా అంటే అది లావణ్య, రాజ్ తరుణ్ సంబంధించినటువంటి వ్యవహారమే అని చెప్పవచ్చు. రాజ్ తరుణ్ తనను కొన్ని సంవత్సరాల పాటు వాడుకొని వదిలేశాడని లావణ్య  బజారుకెక్కింది. తనకు ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ కూడా చేయించాడని చివరికి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని  నాకు రాజ్ తరుణే కావాలంటూ ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.

దీంతో రాజ్ తరుణ్ వ్యవహారం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో హల్చల్ చేసింది. అలా వీరి కేసులో  ఇరుపక్క లాయర్లను కూడా పెట్టేసుకున్నారు. కేసు రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో తాజాగా లావణ్య  గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా లావణ్యపై ప్రీతి అనే అమ్మాయి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు లావణ్య అక్కే డ్రగ్స్ అలవాటు చేసిందని,  ఆమె నాకు ఒక్కదానికే కాకుండా చాలామంది అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసిందని తెలియజేసింది.

 ఆమె వల్ల చాలామంది జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయని పోలీసులకు ప్రీతి  ఫిర్యాదు చేయడంతో అది సంచలనంగా మారింది. ఇదే తరుణంలో  రాజ్ తరుణ్ తరఫున ఉన్న లాయర్ మధు శర్మ కూడా లావణ్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.  ఆమె డ్రగ్స్ కు అలవాటు పడడమే కాకుండా ఎంతో మంది అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి ఆ రొంపిలోకి దింపిందని తెలియజేసింది.

 

 

 అంతేకాకుండా వారు డ్రగ్స్ మత్తులో మునిగిన తర్వాత ఆ ఆడపిల్లల బట్టలు మొత్తం విప్పి న్యూడ్ వీడియోలు తీసి, ఆ వీడియోల ద్వారా వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేదని అన్నాడు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలు  త్వరలో బయటకు రాబోతున్నాయని, ఆడపిల్లలు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా  రాజ్ తరుణ్ కు లావణ్య నుంచి ప్రాణహాని ఉందని ఆయన జీవితం మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లా కాకముందే  లావణ్యను శిక్షించాలని ఆయన తెలియజేశారు.  ఈ విధంగా లావణ్య వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాడంతో షాక్ తగులుతోంది.

newsline-whatsapp-channel
Tags : criminal-case rajtarun lavanya pregnant layer-madhu-sharma

Related Articles