ఏంటి రామ్ చరణ్ మరో హీరో కారణంగా హైట్ తక్కువయ్యాడా.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ హీరో కోసం ఈ హీరో ఎందుకు హైట్ తక్కువయ్యాడు అనే అనుమానాలు ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతాయి. మరి
న్యూస్ లైన్ డెస్క్: ఏంటి రామ్ చరణ్ మరో హీరో కారణంగా హైట్ తక్కువయ్యాడా.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ హీరో కోసం ఈ హీరో ఎందుకు హైట్ తక్కువయ్యాడు అనే అనుమానాలు ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతాయి. మరి ఇంతకీ అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో చిరంజీవి,పవన్ కళ్యాణ్ తర్వాత ఉండేది రామ్ చరణ్ మాత్రమే.
అయితే అలాంటి రామ్ చరణ్ ఓ ఈవెంట్లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అదేంటంటే..నేను హైట్ తక్కువగా ఉండడానికి కారణం ఆ హీరోనే అని చెప్పారు.అయితే రామ్ చరణ్ అంత తక్కువ హైట్ ఉండరు. కరెక్ట్ హైటే ఉంటారు.కానీ సురేఖ అన్నయ్య అల్లు అరవింద్ కాస్త హైట్ తక్కువ ఉంటారు. కాబట్టి తన కొడుక్కి మేనమామ పోలికలు ఎక్కడ వస్తాయోనని భయపడి మంచి ఫుడ్ పెట్టేదట.హైట్ పెరగడానికి అవసరమయ్యే ప్రతి ఒక్క ఫుడ్ ని రామ్ చరణ్ డైట్ లో ఉంచేదట సురేఖ.
అలా ప్రతిరోజు కాలేజీకి క్యారేజీలు పంపించేదట.కానీ చివరికి ఆ క్యారేజీ రాంచరణ్ కాదు రానా తినేవారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ..రానా నేను 8th క్లాస్ నుండి ఫ్రెండ్స్.అయితే నేను హైట్ అవ్వడం కోసం మా అమ్మ బలమైన ఫుడ్ పంపించేది. కానీ నేను రానా అంత హైట్ పెరగలేదు. ఎందుకంటే వాడికేమో సురేష్ ప్రొడక్షన్స్ నుండి పెద్ద క్యారేజీ వస్తుంది.నాకేమో చిన్న క్యారేజ్ వస్తుంది.
రానా వాడి క్యారెజ్ తిని అది కూడా చాలదన్నట్లు రేయ్ చరణ్ నీ దాంట్లో ఏముందిరా అని నా క్యారేజ్ కూడా వాడే తినేవాడు..అంటూ రాంచరణ్ రానా తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది రామ్ చరణ్ కి పంపే ఫుడ్డు కూడా రానా తిని చరణ్ ని హైట్ పెరగకుండా చేశారా అంటూ ఫన్నీగా నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు