Samantha:సమంత కూడా పెళ్లి చేసుకోబోతుందా.?

సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలోని  టాప్ 5 హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. అలాంటి సమంత ఏం మాయ చేసావే అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత


Published Aug 20, 2024 06:50:22 AM
postImages/2024-08-20/1724147971_SAMANTHA.jpg

న్యూస్ లైన్ డెస్క్: సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలోని  టాప్ 5 హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. అలాంటి సమంత ఏం మాయ చేసావే అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుసగా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంది.  ఇక తన కెరియర్ హ్యాపీగా కొనసాగుతున్న తరుణంలోనే  అక్కినేని హీరో నాగచైతన్యతో లవ్ లో పడింది.  చివరికి  ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకున్నారు.  

ఆ తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాలు హ్యాపీగా కాపురం చేసిన వీరి మధ్య ఏం పుట్టిందో ఏమో సడన్ గా విడాకులు తీసుకుంటున్నామని షాక్ ఇచ్చి విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.  ఇక అప్పటినుంచి సమంత తన కెరియర్ పై దృష్టి పెట్టి దూసుకుపోతోంది. ఇదే క్రమంలో ఆమెకు మయోసైటీస్ అనే వ్యాధి వచ్చి అనేక ఇబ్బందులు పడుతోంది.  విదేశాల్లో చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమాల్లో నటిస్తున్న సమంత  సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.

అలాంటి సమంత నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి విషయాల్లో కూడా స్పందించలేదు. అయితే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత చాలామంది సమంత ఇలా అంటుంది, అలా అంటుంది అంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ సమంత మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. నేను ఈరోజు ప్రత్యేక విషయాన్ని చెబుతాను ఎదురుచూడండి అని రాసుకొచ్చింది. ఇంతకీ సమంత ఏం చెబుతారనేది అభిమానుల్లో ఉత్కంఠ   నెలకొని ఉంది.

 ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏమైనా చెబుతుందా లేదంటే కొత్త మూవీ గురించి చెబుతుందా అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే, మరి కొంతమంది ఇవేవీ కాదు సమంత కూడా తన రెండవ పెళ్లికి సంబంధించిన విషయాలని చెబుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. నాగచైతన్య ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి రివెంజ్ తీర్చుకోవాలి అంటే తాను కూడా ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి.  అయితే సమంత దాని గురించే మనకు చెబుతుంది అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line marraige, nagarjuna samantha nagachaitanya sobhita-dhulipala

Related Articles