Jagadish reddy: రేవంత్‌ను ఓ ఆటాడుకున్న జగదీష్‌రెడ్డి

రేవంత్ రెడ్డి సంచులు మోసి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లినప్పుడు తాను సభలోనే ఉన్నట్లు జగదీష్ రెడ్డి వెల్లడించారు. రేవంత్ రెడ్డికి చర్లపల్లి జైలు జీవితం అలవాటు కాబట్టి పదే పదే గుర్తుచేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి జైలుకు వెళ్లడానికే మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారని అన్నారు.


Published Jul 29, 2024 03:15:02 AM
postImages/2024-07-29/1722240894_modi20240729T133947.316.jpg

న్యూస్ లైన్ డెస్క్: సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు BRS నేత, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా మాటల తూటాలను పేల్చారు. అప్పట్లో తాను సభలో మాట్లాడుతున్న సమయంలో జగదీష్ రెడ్డి ఎక్కడున్నారో అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై స్పందించిన జగదీష్ రెడ్డి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు తాను కాంగ్రెస్ పాలకుల  తుపాకి గుండ్లకు బలైన అమరవీరుల కోసం తిరుగుతున్నానని ఆయన గుర్తుచేశారు. కానీ, రేవంత్ రెడ్డి సంచులు మోసి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లినప్పుడు తాను సభలోనే ఉన్నట్లు జగదీష్ రెడ్డి వెల్లడించారు. రేవంత్ రెడ్డికి చర్లపల్లి జైలు జీవితం అలవాటు కాబట్టి పదే పదే గుర్తుచేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి జైలుకు వెళ్లడానికే మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. తనకు కూడా జైలు జీవితం గుర్తుందని జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా  ఆ సమయంలో జైలుకు వెళ్లానని ఆయన తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu brs tspolitics congress telanganam రేవంత్-రెడ్డి

Related Articles