బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా రాణించడానికి కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలకి ఓకే చెప్పింది.ఇప్పటికే దేవరలో ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంది. అయితే బాలీవుడ్ లో అవకాశాలు
న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా రాణించడానికి కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలకి ఓకే చెప్పింది.ఇప్పటికే దేవరలో ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంది. అయితే బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్న కూడా తల్లిలాగే తెలుగు సినిమాల్లో రాణించడం ఆమెకు ఇష్టం కాబట్టి తెలుగులో ఫేమస్ అవ్వాలని చూస్తోంది.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ పనిని ఎప్పటికీ చేయను అంటూ దర్శకులకు కొత్త కండిషన్ పెడుతుందట. మరి ఇంతకీ జాన్వికపూర్ తన తల్లికి ఇచ్చిన మాట ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.బోని కపూర్ శ్రీదేవిల ముద్దుల కూతురు జాన్వికపూర్ ప్రస్తుతం దేవర,ఆర్ సి 16 అనే సినిమాలలో చేస్తోంది.
అలాగే నాని ప్రభాస్ వంటి హీరోల సినిమాలకు కూడా జాన్వి కపూర్ ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ విషయం పక్కన పెడితే జాన్వి కపూర్ తన తల్లి శ్రీదేవి బతికున్న సమయంలో ఒక మాట ఇచ్చిందట. అదేంటంటే.. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన జుట్టు కట్ చేసుకోను అని..అయితే తన తల్లి చనిపోయినా కూడా ఇచ్చిన మాట తప్పకూడదని భావించుకుందట.
అందుకే సినిమాల కోసం దర్శకులు జుట్టు కట్ చేసుకోమని అడిగితే..సారీ నేను మా అమ్మకి మాట ఇచ్చాను. ఎప్పటికీ హెయిర్ కట్ చేసుకోలేను.. అందుకే ఈ ఒక్క మాట అడగకండి అంటూ జాన్వీ నీ కపూర్ బదులిస్తుందట.అమ్మ కి ఇచ్చిన మాట కోసం ఎప్పటికీ జుట్టు కట్ చేసుకోనని జాన్వీ కపూర్ చెబుతుంది