Jr Ntr:షూటింగ్ లో గొడవొచ్చి హీరోయిన్ తో ఆ పని చేసిన ఎన్టీఆర్.!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో టాప్ లెవల్ లో ఉన్న హీరో. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో


Published Aug 16, 2024 05:38:00 PM
postImages/2024-08-16/1723805262_shetty.jpg

న్యూస్ లైన్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో టాప్ లెవల్ లో ఉన్న హీరో. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కథానాయికలతో జతకట్టారు.  ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాజల్, ఆర్తి అగర్వాల్, అంకిత, భూమిక,  ప్రియమణి ఇంకా మరింత మందితో ఆయన  సినిమాలు చేశారు.  ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది హీరోయిన్లతో ఎన్టీఆర్ నటించిన కానీ, ఆ ఒక్క హీరోయిన్ తో మాత్రం జతకట్టలేదట.

దీనికి కారణం కూడా ఉందని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి నటించే అవకాశం వచ్చిన ఎన్టీఆర్ వదిలేసారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఎన్టీఆర్  స్టార్ హీరోయిన్ అయినటువంటి అనుష్క శెట్టితో ఇప్పటివరకు సినిమా చేయలేదట. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో శక్తి మూవీని తీయాలనుకున్నారట దర్శక నిర్మాతలు. కానీ చివరికి  అనుష్కను కాదని హీరోయిన్ గా ఇలియానాను తీసుకున్నారు.  అయితే అనుష్కను పక్కన పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమా సమయంలో అనుష్క భారీగా పారితోషకం అడిగిందట. దీనివల్ల జూనియర్ ఎన్టీఆర్ కు అనుష్కకు మధ్య గొడవ జరిగిందని అనేక వార్తలు రాసుకోచ్చారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని తర్వాత తేలిపోయింది.  అయితే అనుష్క ఎన్టీఆర్ కాంబోలో సినిమా చేస్తే హైట్ ప్రాబ్లం వస్తుందని  దర్శక నిర్మాతలు భావించారట. దీనివల్ల ఇద్దరి జోడి మ్యాచ్ అవ్వదని, అందువల్ల చివరి సమయంలో ఇలియానాను తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. వీరిద్దరి మధ్య వచ్చే సినిమా మిస్ అయిపోయింది.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr kajal-agarwal anushka-setty priyamani shakthi

Related Articles