KALKI: కల్కి 2898 AD మూవీ ఓటీటీ రిలీజ్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో అబ్బురపరిచింది. జనాలు థియేటర్ లో చాలా బాగా ఆదరించారు. అయినా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు.


Published Aug 18, 2024 02:03:00 PM
postImages/2024-08-18/1723970059_kalkiday2predictionmain1719517346.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; యంగ్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా సినిమా సూపర్ డూపర్ హిట్టు.  బాహుబలి తర్వాత ఓవరాల్ ప్రభాస్ బాక్సాఫీస్ లో సత్తా చాటిన సినిమా కల్కి . ప్రభాస్ కు బాహుబలి రేంజ్ హిట్టు పడింది. అన్ని రాష్ట్రాల వారికి నచ్చేస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో అబ్బురపరిచింది. జనాలు థియేటర్ లో చాలా బాగా ఆదరించారు. అయినా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు.


కల్కి చిత్రాన్ని మరోసారి ఓటిటిలో చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతలా నాగ్ అశ్విన్ మంచి కిక్ ఇచ్చాడు. కల్కి ఓటిటి రిలీజ్ గురించి నెట్ ఫ్లిక్స్ సంస్థ అదిరిపోయే అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది. 
ఆగష్టు 22 నుంచి కల్కి హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ,తమిళ్ తో పాటు మిగిలిని సౌత్ ఇండియన్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలు కానుంది.

ప్రభాస్ అభిమానులకు ఈ న్యూస్ చాలా గుడ్ న్యూస్. మహాభారత సన్నివేశాలతో చిత్రాన్ని ప్రారంభించిన నాగ్ అశ్విన్ నెమ్మదిగా ఫస్ట్ హాఫ్ ని నడిపించాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో సినిమా గేర్ మారుతుంది. క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడిగా చూపించే విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ సినిమా మాగ్జిమం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యాక్షన్ సీరిస్ నచ్చేవారికి కూడా చాలా నచ్చేసింది.

newsline-whatsapp-channel
Tags : kalki-2898-ad newslinetelugu ott-movies net-flex

Related Articles