Kanguva Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న కంగువా ట్రైలర్..!!

సూర్య హీరోగా.. దిశాపఠాని హీరోయిన్ గా చేస్తున్న తాజా సినిమా కంగువా.. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా చేసారు. శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువా నుండి విడుదలైన పోస్టర్, సూర్య లుక్ ఇప్పటికే 


Published Aug 12, 2024 02:06:43 PM
postImages/2024-08-12/1723451803_kanguvatrailer.jpg

న్యూస్ లైన్ డెస్క్: సూర్య హీరోగా.. దిశాపఠాని హీరోయిన్ గా చేస్తున్న తాజా సినిమా కంగువా.. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా చేసారు. శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువా నుండి విడుదలైన పోస్టర్, సూర్య లుక్ ఇప్పటికే అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేసింది. అయితే తాజాగా కంగువా  నుండి విడుదలైన ట్రైలర్ చూస్తే మాత్రం ఒక్కొక్కరికి గూస్ బంప్సే..ట్రైలర్ ని చాలా అద్భుతంగా కట్ చేశాడు డైరెక్టర్.

ఇక ఈ ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై మరిన్ని హోప్స్ పెరిగిపోతున్నాయి అభిమానులకి.. ఈ ట్రైలర్లో విలన్ బాబి డియోల్ ని చాలా స్ట్రాంగ్ గా భయానకంగా చూపించారు. అయితే బాబీ డియోల్ ఒక తెగ కి నాయకుడిగా పని చేస్తాడు.మిగతా తెగలన్నింటి మీద విజయం సాధిస్తూ అన్నింటిని తన వశం చేసుకొని అందరిని శాసించే నాయకుడిగా మారాలని చూస్తాడు.

ఇక బాబీ డియోల్ లాగే సూర్య కూడా తన తెగని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా సూర్యకి బాబీ డియేల్ కి మధ్య యుద్ధం ఎలా జరుగుతుంది చివరికి ఎలా ఎండ్ అవుతుంది అనేదే ఈ సినిమా ఉద్దేశం.. అయితే ఈ ట్రైలర్లో సూర్య లుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.

ఇక ట్రైలర్ చూసిన అభిమానులైతే సూర్య ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్టు పడ్డట్లే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ మూవీకి మరో ప్లస్ ఏంటంటే.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్. కంగువా ట్రైలర్ లో దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.. ఫాంటసీ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

https://youtu.be/kbvHM2S2_bk

newsline-whatsapp-channel
Tags : newslinetelugu disha-patani suriya kanguva- kanguva-trailer bobby-deol

Related Articles