ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ చేస్తున్న మూవీ కాంతార చాప్టర్ 1రిషబ్ శెట్టి డైరక్షన్ లో వస్తున్న ప్రతిష్టాత్మకంగా వచ్చిన సినిమా కాంతార ..ఇప్పుడు కాంతార చాప్టర్ 1 రిలీజ్ కానుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.
కాంతార చాఫ్టర్ సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ అండగా నిలిచారు. ఈ సినిమాకు ఇదో స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి ఫ్యాన్స్‌లో క్రేజ్ పెంచారు మూవీ టీం. ఇక ట్రైలర్ విషయానికి వస్తే నాన్న ఎలా తప్పిపోయాడు అని ఓ చిన్నపిల్లాడు అడుగుతాడు. ఈ సీన్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది... ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియెన్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తమ పూర్వీకులు అంతా ఉండేది ఇక్కడే.. అందంతా పెద్ద దంత కథ అంటూ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు.
భూమ్మీద అధర్మం పెరిగిపోయినపుడు దానిని నశింపజేయడానికి ఈశ్వరుడు తన గణాలను భూమ్మీదకు పంపుతాడు. ఈ పుణ్యభూమిని కొన్ని అగ్నికణాలు కొలువయ్యాయి అంటూ ఆ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. ఈ సీన్స్ చాలా అధ్భుతంగా ఉన్నాయి. కాంతార అనే జైలులోకి అసలు వెళ్లకూడదు అంటూ పిల్లలకు బయపెట్టే కథ చెప్తున్నట్లు కనిపిస్తుంది.ఓ రాజు, అతడిని ఎదురించే సేనలు, ఓ బ్రహ్మరాక్షసి అంశాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. అంతేకాదు ఓ యువరాణి , గిరిజన కుర్రాడు ప్రేమించుకునే అంశాలు ..రాజు గిరిజన ప్రాంతంపై దాడిచేసే సన్నివేశాలు అధ్భుతంగా తీశారు. అక్టోబర్ 1 వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ మూవీ భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.