Padi Koushik reddy: దానం.. దమ్ముంటే రాజీనామా చెయ్

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చారని ఎవరు నిరూపించాలని అయన అన్నారు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్‌పై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకాలతో భారీ పత్రికా ప్రకటనలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. 


Published Aug 03, 2024 03:34:03 PM
postImages/2024-08-03/1722679443_koushik2.jpg

న్యూస్ లైన్ డెస్క్: అసెంబ్లీలో నోరుపారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా హల్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. దానంకు దమ్ముంటే.. తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. కేసీఆర్ హయాంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, పది లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. 

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చారని ఎవరు నిరూపించాలని అయన అన్నారు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్‌పై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకాలతో భారీ పత్రికా ప్రకటనలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారని కౌశిక్ రెడ్డి అన్నారు.  

BRS సభ్యులు నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే.. సీఎం దానం నాగేందర్‌ను రెచ్చగొట్టి బూతులు మాట్లాడించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దానం నాగేందర్ హైదరాబాద్‌లో మమ్మల్ని తిరగనివ్వం అంటున్నారు. ఎక్కడికి రమ్మన్నా వస్తా.. చూసుకుందామా..? అని ప్రశ్నించారు. 
 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu brs tspolitics congress danamnagender

Related Articles