Bharatiya Nyaya Sanhita: నేర న్యాయ చట్టాల్లో మార్పులు..తీర్పు రెండు వారాల్లోనే 2024-06-27 13:16:33

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఇండియన్ ( INDIAN LAWS)  చట్టాలు ఎలా ఉంటాయో...జనాలందరికి తెలిసిందే...మనవాళ్లు ..నేరస్థుడికి తర్వాత శిక్ష వెయ్యొచ్చు కాని...విచారణ మాత్రం గట్టిగా పాతికేళ్లు చేస్తారు. ఇకపై ఈ విధానానికి స్వస్తి చెప్పి కొత్త న్యాయ చట్టాలు తీసుకువస్తున్నారు. జీరో ఎఫ్ఐఆర్( ZERO FIR) , ఫిర్యాదులు, సమన్ల జారీ వంటివన్నీ ఇకపై ఆన్‌లైన్ ద్వారానే జరగనున్నాయి. జులై 1 నుంచి దేశంలో కొత్తగా నేర న్యాయ చట్టలలో భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇండియన్ పీనల్ కోడ్‌ (IPC), సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల( ADVIDENCE ACT) లో భారీ మార్పులు చేసిన ప్రభుత్వం దానిని ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్’ గా మార్చింది.


ఇకపై అన్నీ ఎలక్ట్రానిక్ ( ELECTRONIC MEDIUM) మాధ్యమంలోనే జరగనున్నాయి. హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేస్తారు. అసలు చట్టాల్లో ఏ ఏ మార్పులు జరుగుతున్నాయో చూద్దాం.


* ఇకపై బాధితుడు  పోలీస్ స్టేషన్‌కు( POLICE STATION ) వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయొచ్చు.


* జీరో ఎఫ్ఐఆర్( FIR) ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు. దీని వల్ల చాలా కేసులు ఇన్ టైంలో సాల్వ్ అవుతాయి.


* ఏ కారణం చేతనైనా అరెస్ట్ అయితే ...మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ , లాయర్( LAWYER)  కు ఫోన్ చేసి పరిస్థితి వివరించవచ్చు.


*హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంది. పదే పదే విచారణ కోసం టైం వేస్ట్ చెయ్యక్కర్లేదు. 


* మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తికావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది.


* సమన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో పంపించవచ్చు. 

* రేప్ కేసుల్లో( RAPE CASES)  బాధితుల వాగ్మూలాన్ని ...మహిళా మేజిస్ట్రేట్ ఎదురుగా మాత్రమే తీసుకోవాలి. లేకపోతే  ఓ మహిళా పోలీస్ ఆధ్వర్యంలో  మేల్ మేజిస్ట్రేట్  బాధితురాలి వాగ్మూలాన్ని తీసుకోవచ్చు.


* కేసు విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి.


* అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లకు మించి వయసున్నవారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు. వీటిని మార్చి న్యాయ చట్టల్లో మార్పులు చేపట్టనుంది. ఈ రూల్స్ అన్ని జూలై 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.