kiran: పెళ్లి పనుల్లో కిరణ్ అబ్బవరం.. సంగీత్ పిక్స్ షేర్ చేసిన రహస్య !

కొన్ని రోజులు క్రితమే కిరణ్ అబ్బవరం తన సినిమా ఈ వెంట్లో ఆగష్టు లో పెళ్లి ఉంటుందని అనౌన్స్ చేశారు.


Published Aug 12, 2024 02:19:00 PM
postImages/2024-08-12/1723452609_kiranabbavaram.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కిరణ్ అబ్బవరం ఇంట పెళ్లి పనులు స్టార్టయ్యాయి. తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకుంటున్నాడు కిరణ్. అయితే ఐదేళ్లు ప్రేమలో ఉన్నా ...బయటకు ఏ మాత్రం లీక్ అవ్వకుండా జాగ్రత్త పడిన ఈ జంట రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని పెళ్లి కి రెడీ అవుతున్నారు.రాజావారు రాణి వారు సినిమా చేస్తున్నప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ పు్ట్టిందట. కొన్ని రోజులు క్రితమే కిరణ్ అబ్బవరం తన సినిమా ఈ వెంట్లో ఆగష్టు లో పెళ్లి ఉంటుందని అనౌన్స్ చేశారు.


తాజాగా కిరణ్ అబ్బవరం పెళ్లి పనులు మొదలయ్యాయి. రహస్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ పూజలు చేస్తున్నారు. అలాగే సంగీత్ కి డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న  వీడియో కూడా షేర్ చేసింది. దీంతో కిరణ్ అబ్బవరం పెళ్లి పనులు మొదలయినట్టు తెలుస్తుంది. కిరణ్, రహస్య పూజ చేస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.


వైట్ కుర్తా పైజామా తో చాలా సింపుల్ లుక్ లో కనిపించాడు కిరణ్ ...రహస్య మాత్రం సీ గ్రీన్ విత్ ఎల్లో బోర్డర్ సారీ లో చక్కగా రెడీ అయ్యి పూజ జరిపిస్తున్నారు. తన ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మధ్యలో చాలా సింపుల్ గా చేసుకుంటారంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఆల్ ది బెస్ట్ అంటున్నారు నెటిజన్లు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movies kiran-abbavaram

Related Articles