రేవంత్ రెడ్డి కంటే నేనే ఫేమస్ అంటున్న కొడంగల్ బిడ్డ..ట్విస్ట్ మామూలుగా లేదుగా.?

టిక్ టాక్ ఎప్పుడైతే మన ఇండియాలోకి ఆవిర్భవించిందో అప్పుడే చాలామంది వారి టాలెంటును 10 మందికి చూపించుకునే పరిస్థితి ఏర్పడింది. అలా టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయిపోయి


Published Aug 13, 2024 10:51:43 AM
postImages/2024-08-13/1723526503_ushekar.jpg

న్యూస్ లైన్ డెస్క్: టిక్ టాక్ ఎప్పుడైతే మన ఇండియాలోకి ఆవిర్భవించిందో అప్పుడే చాలామంది వారి టాలెంటును 10 మందికి చూపించుకునే పరిస్థితి ఏర్పడింది. అలా టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయిపోయి  సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ సంపాదించుకున్న ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. అలా చివరికి టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత మిగతా సోషల్ మీడియా  ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా వారి టాలెంట్ ను బయట పెట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యూ శేఖర్.

https://x.com/ramavath_swaero/status/1823021368637604024?t=nue72U6zuRbVbTEF1BNvLw&s=08

సోషల్ మీడియాలో ఈయన చాలా ఫేమస్. అర్థం కాని భాషలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే ఈయన స్పెషాలిటీ. ఆయన మాటలు చూస్తే తప్పనిసరిగా నవ్వు వస్తుంది. కాసేపు నవ్వుకోవాలంటే యు శేఖర్ మాట్లాడే మాటలు వినాల్సిందే. అలా సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి యు శేఖర్  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  రేవంత్ రెడ్డి పై కూడా పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.  ఈ సందర్భంగా యాంకర్ యు శేఖర్ ను మీది ఎక్కడ అని అడిగితే కొడంగల్ అని చెప్పాడు.  రేవంత్ రెడ్డి తెలుసా అని అడిగితే తెలుసు అని చెప్పాడు. నువ్వు ఫేమసా రేవంత్ రెడ్డి ఫేమస్సా అంటే కొడంగల్ లో నేనే ఫేమస్ ఆ తర్వాతే రేవంత్ రెడ్డి అన్నాడు.

అంతేకాదు  మరో మాటలో కొడంగల్ లో నేను రేవంత్ రెడ్డి ఈక్వల్ అన్నాడు. ఈ విధంగా రేవంత్ రెడ్డి మీద ఆయన ఇలా మాట్లాడటంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో పలువురు నెటిజన్లు  రేవంత్ రెడ్డి కంటే కోడంగల్  లో u శేఖర్ బెటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో  రేవంత్ రెడ్డి పై గెలిచేది U శేఖరే  అంటున్నారు. అంతేకాకుండా  గుంపు మేస్త్రి యు శేఖరు అంతటివాడు కాదు అంటూ కొంతమందిని నేటిజన్స్  వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line cm-revanth-reddy youtube social-media u-shekar kodamgal

Related Articles