న్యూస్ లైన్ డెస్క్ : ఎప్పుడూ వార్తల్లో ఉంటూ సంచలనాత్మక కామెంట్లు చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సెన్సేషనల్ కామెంట్లు చేశారు. గతంలో ఓసారి మాట్లాడుతూ.. త్వరలో తానే ముఖ్యమంత్రిని కాబోతున్నా అని.. తన నాలుకపై మచ్చలున్నాయని అన్నారు కోమటిరెడ్డి. అయితే.. ఇప్పుడు మరోసారి నాలుకపై మచ్చల ప్రస్తావన తెచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కామెంట్లు చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్
ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు..
నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయి.. తప్పనిసరిగా భవిష్యత్ లో సీఎం అవుతారు
నల్లగొండ ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయ్యారు
బునాదిగాని పిల్లయిపల్లి ధర్మారెడ్డి కాలువలను రీ డిజైన్ చేయాలి
కాలువల… https://t.co/lJYetzxAv8 pic.twitter.com/umgwDBQhX9 — Telangana Awaaz (@telanganaawaaz) August 30, 2024
నల్లగొండ జిల్లా బునాదిగాని, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువను రీ డిజైన్ చేయాలంటూ మాట్లాడిన ఆయన భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తన తర్వాత ముఖ్యమంత్రి అర్హత కేవలం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాత్రమే ఉందని కామెంట్ చేశారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డడి మాత్రం త్వరలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అంటూ కామెంట్ చేయడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది.