వరద ప్రభావిత ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలపై ఆయన స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రతిదానికీ మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ రావాలని పిలిచే సీఎం రేవంత్ రెడ్డికి అధికారం ఎందుకని BRS సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలపై ఆయన స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
అధికార పార్టీ వాళ్లే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మొదటిసారి చూస్తున్నామని అయన ఎద్దేవా చేశారు. దీన్ని చూస్తుంటే కాంగ్రెస్ వాళ్లే సెల్ఫ్ గోల్ పెట్టుకున్నట్లుగా ఉందని వెల్లడించారు. కేసీఆర్ కాంగ్రెస్కు సమయం ఇచ్చారని, అలాంటి సమయంలో పరిపాలనను చూపించాలని క్రిశాంక్ సూచించారు. ప్రతిసారీ కేసీఆర్ మీద ఏడవడం ఆపాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.
First time saw Ruling Government making posters of Opposition leader demanding him to tour Flood affected areas.
Such a self goal by Congress.
If you need KCR to come,
Why are you in Government then
Tags : ts-news news-line newslinetelugu tspolitics congress cm-revanth-reddy social-media mannekrishank