Vinesh Phogat : వినేశ్ ఫొగట్ పై మహేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు

ఫైనల్ మ్యాచ్ కి ముందు డిస్ క్వాలిఫై చేయడంపై దేశవ్యాప్తంగా అభిమానులు వినేశ్ ఫొగాట్ కి అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వినేశ్ ఫొగాట్ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఆమెకు తన మద్దతు ప్రకటించారు.


Published Aug 08, 2024 02:52:01 PM
postImages/2024-08-08/1723108921_MaheshBabuTweet.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ఒలంపిక్స్ లో వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ చేరి బంగారు పతకం సాధిస్తుందని ఆశించిన భారతీయులకు భారీ షాకే తగిలింది. ఫైనల్ వరకు దూసుకెళ్లిన ఫొగాట్.. చివరి క్షణంలో అనర్హతకు గురై ఇంటికి రావాల్సి వచ్చింది. 50 కేజీల విభాగంలో తలపడాల్సిన ఫొగాట్ ను 100 గ్రాముల బరువు అదనంగా ఉన్నదని గుర్తించి అనర్హత వేటు వేశారు. ఫైనల్ మ్యాచ్ కి ముందు డిస్ క్వాలిఫై చేయడంపై దేశవ్యాప్తంగా అభిమానులు వినేశ్ ఫొగాట్ కి అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు.

తాజాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వినేశ్ ఫొగాట్ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఆమెకు తన మద్దతు ప్రకటించారు. ‘ఫలితంతో సంబంధం లేదు. మీరు ఫైనల్ వరకు చేరారు. అది మీ గొప్పతనం. మీరు నిజమైన ఛాంపియన్.  ఆ విషయం అందరికీ తెలుసు. కష్టాల్లో అండగా నిలవడానికి మీ ధృడత్వం, బలం అందరికీ ఇన్సిపిరేషన్, పతకం రావడం ముఖ్యం కాదు. మీ స్పూర్తి మా అందరిలో ప్రకాశిస్తుంది. 1.4 బిలియన్ గుండెలు మీతో పాటు ఉన్నాయి’ అంటూ ఎక్స్ వేదికగా మహేశ్ బాబు స్పందించారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, తాప్సీతో పాటు పలువురు సెలెబ్రిటీలు ఫొగాట్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

newsline-whatsapp-channel
Tags : tollywood twitter-review mahesh-babu latest-news news-updates telugu-news

Related Articles