ఆరోగ్యం కోసం వర్కవుట్ చేస్తే.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కానీ.. ఈ మధ్య వర్కవుట్ చేస్తూ గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
న్యూస్ లైన్ డెస్క్ : వర్కవుట్ చేస్తూ ఉన్నపళంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తి జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు. శంభాజీ నగర్ లోని ఓ జిమ్ లో తోటివారితో కలిసి వర్కవుట్ చేస్తున్న వ్యక్తి ఆయాసంతో గోడను పట్టుకొని నిలబడాలనుకున్నాడు. అంతలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్నవారు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు తెలిపారు.