యాంకర్ లొట్టలు వేయడం చూసి ...మా ఆయన కూడా నన్ను చూసి అలాగే లొట్టలు వేస్తాడు. 'నా భర్త పబ్లిక్‌లో కూడా అలా లొట్టలు వేసి పిలుస్తుంటారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మిగిలిన ఇండస్ట్రీల మాదిరిగానే టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంతమంది చాలా బోల్డ్ గా మాట్లాడుతారు. టాలీవుడ్ నుంచి అయితే ఫస్ట్ పేరు మన మంచు లచ్మక్క పేరే చెప్పాలి. పాపం నిజాలే మాట్లాడతాది కాని ..జనాలకే తప్పుగా అర్ధమవుతాయి. ఏం చేస్తాం...కొంతమంది అంతే. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా టాలీవుడ్లో తనదైన చిత్రాలు చేస్తూ ఈ అమ్మడు తన రేంజ్‌ను పెంచుకుంటూనే ఉంది. రీసెంట్ గా యక్షిణీ వెబ్ సీరిస్ తో మెప్పించింది. రీసెంట్ గా ఇంటర్వ్యూ లో తన భర్త గురించి చెప్పేసింది.
దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్‌గా, హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఆయన ఎన్నో రకాలుగా సేవలు అందించారు.'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో మంచు లక్ష్మి యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే చిత్రాన్ని కూడా చేసింది. తెలుగు లో 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో టాలీవుడ్లోకి నటిగా ఎంటరైంది. 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను దక్కించుకుంది. బోల్డ్ అండ్ టాలెంట్ యాక్టర్ మన లచ్మక్క.
లేడీ ఓరియెంటెడ్ మూవీలను ఎక్కువగా చేస్తోంది. ఇలా ఇప్పుడు 'ఆదిపర్వం' అనే సినిమా చేస్తోంది. ఇక, ఇటీవలే ఈ అమ్మడు 'యక్షిణి' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ లొట్టలు వేయడం చూసి ...మా ఆయన కూడా నన్ను చూసి అలాగే లొట్టలు వేస్తాడు. 'నా భర్త పబ్లిక్‌లో కూడా అలా లొట్టలు వేసి పిలుస్తుంటారు. చాలా సార్లు ఆయనకు అలా చేయొద్దని చెప్పాను. అయినా మాట వినడు మాయదారి మొగుడంటు నవ్వేసింది. నెటిజన్లు మాత్రం ఏంది లక్ష్మక్క ..మొగుడు ఏదో పరాచకానికి చేస్తే ..నవ్వు ఇలా మీడియా ముందే పెట్టేస్తావా అంటూ కామెంట్ పెడుతున్నారు.