Manu Niraj:మను నీరజ్ పెళ్లి..ఒట్టు వేసి మరీ ఒకే చెప్పారా.?

ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వినిపిస్తున్న పేర్లు మనోభాకర్ నీరజ్ చోప్రా. ఇద్దరు అథ్లెట్స్  మన దేశ కీర్తిని ప్రపంచానికి కనిపించేలా చేశారు.  తాజాగా జరిగినటువంటి ఒలంపిక్స్ లో ఇద్దరు


Published Aug 13, 2024 02:10:49 PM
postImages/2024-08-13/1723538449_manubhakar.jpg

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వినిపిస్తున్న పేర్లు మనోభాకర్ నీరజ్ చోప్రా. ఇద్దరు అథ్లెట్స్  మన దేశ కీర్తిని ప్రపంచానికి కనిపించేలా చేశారు.  తాజాగా జరిగినటువంటి ఒలంపిక్స్ లో ఇద్దరు స్టార్లు పథకాలు సాధించి ఇండియాకు పేరు తీసుకువచ్చారు. ఇదే తరుణంలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలోనే మానుభాకర్ నీరజ్ చోప్రా కలిసి మాట్లాడుకున్న ఒక వీడియో కూడా వైరల్ అయింది.

https://x.com/Gauravp26188714/status/1822834642958897318?s=19

ఇందులో ఇద్దరు చాలా సిగ్గుపడుతూ ఒకరితో ఒకరు ముచ్చటించుకోవడం అందరూ చూశారు.  తాజాగా మను తల్లి నీరజ్ చోప్రాతో మాట్లాడుతూ  అతనితో ఒట్టు కూడా వేయించుకోవడం కనిపిస్తోంది.  ఇది చూసిన చాలామంది ఆమె నెటిజన్స్ ఆమె పెళ్లి విషయంలోనే ఒట్టు వేయించుకుందని అంటున్నారు.

https://x.com/avinasharyan09/status/1822688423896826041?s=19

అయితే ఈ విధంగా వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు బయట గుప్పుమనడంతో తాజాగా మను బాకర్ తండ్రి రామ్ కిషన్  స్పందించారు. మనుబాకర్ చిన్నపిల్లా అని ఇంకా పెళ్లి వయసు రాలేదని ఆ వార్తలన్నీ అసత్యాలు అని కొట్టిపారేశారు. నేను ఇప్పుడే పెళ్లి విషయం ఏమి ఆలోచించడం లేదని తాను కూడా ఈ విషయాలను పట్టించుకోవడంలేదని తెలియజేశారు. నీరజ్ చోప్రాను నా భార్య ఒక బిడ్డల భావించి అలా మాట్లాడింది. దాన్ని పెళ్లి విషయానికి కన్వర్ట్ చేసి ఈ విధంగా వార్తలు క్రియేట్ చేయడం మంచి పద్ధతి కాదంటూ ఆయన ఈ వార్తలను కొట్టి పారేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : marraige manubhaker olympics niraj-chopra paris

Related Articles