న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్; ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు ఏటూరునాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ , మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో మావోయిస్టుల కీలక నేత బద్రు మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో భారీ గా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ లో బద్రు (35) మధు (43) కరుణాకర్ (22) జైసింగ్ (25) కిషోర్ ( 22) కామేశ్ (23) మృతి చెందినట్లు సమాచారం . ఎన్ కౌంటర పై పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.