Varun Tej: మ‌ట్కా నుంచి వరుణ్ నయా లుక్

ఆదివారం ఈ సినిమాకు సంబంధించి మూవీయూనిట్ సాలిడ్ అప్‌డేట్ అందించింది.


Published Aug 11, 2024 02:56:55 PM
postImages/2024-08-11/1723368415_matka.PNG

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మట్కా’. ఈ మూవీకి పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుంగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటీకే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు పేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఆదివారం ఈ సినిమాకు సంబంధించి మూవీయూనిట్ సాలిడ్ అప్‌డేట్ అందించింది.

ఈ మూవీ నుంచి వరుణ్ తేజ్ నయా పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో వరుణ్ సిగరెట్ పట్టుకుని ఉన్న మాస్ లుక్ అభిమానలను ఆకట్టుకుంది. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటనను ఆధారం చేసుకొని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వైజాగ్‌ నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో వరుణ్‌ నాలుగు భిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్‌‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకోబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. నవీన్‌ చంద్ర, కిశోర్, రవీంద్ర విజయ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకు జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
 

newsline-whatsapp-channel
Tags : tollywood movie-news hero- new-post

Related Articles