MEGHA AKASH: మేఘా ఆకాష్ సడన్ సర్ ప్రైజ్ ..ఎంగేజ్ మెంట్ చేసేసుకుందిగా !


2017 లో 'లై' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది మేఘా ఆకాష్. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు నితిన్‌‌కి జోడీగా నటించి మెప్పించింది


Published Aug 23, 2024 10:14:00 PM
postImages/2024-08-23/1724431496_meghana.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మేఘూ ఆకాష్ తన ఫ్యాన్స్ కు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. చిన్న హింట్ కూడా ఇవ్వకుండా ఎంగేజ్ మెంట్ చేసేసుకుంది.సడెన్‌గా తనకు కాబోయే వాడ్ని పరిచయం చేయడంతో అంతా షాక్ అయ్యారు. చాలా యేళ్లుగా ఓ కుర్రాడితో లవ్ లో ఉన్నా..గాసిప్స్ రాకుండా చాలా జాగ్రత్త పడింది. కొన్నాళ్లుగా సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఈ అమ్మాయి ..తన భర్తతో ఉన్న పిక్ ను పోస్ట్ చేస్తూ డ్రీమ్ కమ్స్ ట్రూ అంటూ పోస్ట్ చేసింది.


2017 లో 'లై' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది మేఘా ఆకాష్. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు నితిన్‌‌కి జోడీగా నటించి మెప్పించింది. తెలుగు లో కంటే కోలివుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తమిళ్ , తెలుగు , హిందీ లైన్ గా సినిమాలు చేస్తూ కెరీర్ ను ఫుల్ బిజీగా ఉన్న టైంలో సడెన్ గా తన నిశ్చితార్థం ఫోటోలు షేర్‌ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. తన లైఫ్ పార్ట్ నర్ ను తెగ చెక్ చేస్తున్నారు నెటిజన్లు.


మేఘా కానీ ఆమె ఫ్యామిలీ కాని  తన పెళ్లి డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు . ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, మేఘా ఆకాష్‌కిసరి జోడీగా సాయి విష్ణు ఉన్నాడని అంటున్నారు. పెళ్లి డేట్ కాని ..తన నెక్స్ట్ సినిమా షెడ్యూల్స్ కాని మేఘూ అనౌన్స్ చెయ్యలేదు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral social-media engagement

Related Articles