హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మీద నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మీద నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. హైడ్రాని రద్దు చేయాలని ఎంఐం పార్టీ డిమాండ్ చేసింది. బహదూర్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్‌లోని శాస్త్రిపురం కింగ్స్ కాలనీలో ముబీన్‌కు చెందిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీని అడ్డుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యే ముబీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కబ్జాలకు అడ్డుకట్ట వేస్తున్న హైడ్రా రద్దు చేయాలని సొంత వర్గం నుండే తిరుగుబాటు చేస్తున్నారు.
ఇక నిన్న స్వపక్షం నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రాను రద్దు చేయాలని హైడ్రా కమిషన్ రంగనాథతో గొడవ పెట్టుకున్నారు. ఇక బుధవారం మిత్రపక్షం ఎంఐఎం పార్టీ నాయకులు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీని కలిసి హైడ్రాను వెంటనే రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాపై తిరుగుబాటు రావడంతో చర్చనీయాంశంగా మారింది.