పాన్ ఇండియా స్టార్ మోహన్ లాల్ అంటే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. మలయాళ ఇండస్ట్రీలో తన చక్రం తిప్పుతున్న మోహన్ లాల్ అద్భుతమైన కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తూ
న్యూస్ లైన్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ మోహన్ లాల్ అంటే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. మలయాళ ఇండస్ట్రీలో తన చక్రం తిప్పుతున్న మోహన్ లాల్ అద్భుతమైన కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన చేసిన చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అవుతూ ఉంటాయి. అలా హీరో గానే కాకుండా మానవత్వం అనే పదానికి మోహన్ లాల్ బ్రాండ్ అంబాసిడర్. దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా ఈయన సహకారం అందిస్తూనే ఉంటారు.
అలా ఎంతో సహకార గుణం కలిగినటువంటి మోహన్ లాల్ కు తాజాగా అనారోగ్యం కలిగినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అయితే మోహన్ లాల్ తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వల్ల ఆయన కొచ్చిలోని అమృత అనే హాస్పిటల్ లో చేరారట. ఈ విషయాన్ని డాక్టర్లు కూడా వెల్లడించారు. అయితే సీరియస్ కండిషన్ లో ఆయన ఆస్పత్రికి వెళ్లాలని, ఇప్పటికే డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని ఇప్పుడిప్పుడే కాస్త కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.
https://x.com/sri50/status/1825065861109194871?s=19
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని మోహన్ లాల్ త్వరలోనే కోలుకుంటారని డాక్టర్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మా అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని చెబుతూ చాలామంది దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం బయటకు వచ్చిందో లేదో, కానీ ఆయనకు ఏదో అయిపోయినట్టు, చాలా సీరియస్ గా ఉన్నట్టు చావు బతుకుల మధ్య ఉన్నట్టు కొంతమంది వార్తలు రాస్తున్నారు. కానీ అదేమీ లేదట మోహన్ లాల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు అన్నారు. అయితే మోహన్ లాల్ తాజాగా 'ఏంపురాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు.