Mufasa: ముఫాసా తెలుగు ట్రైలర్.. మహేష్ బాబు వాయిస్ అదుర్స్.!

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నటువంటి మూవీ "ముఫాసా ది లయన్ కింగ్". ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ అయినటువంటి డిస్నీ భారీగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ది లయన్ కింగ్ 


Published Aug 26, 2024 03:26:02 AM
postImages/2024-08-26/1724658828_MUFASATHELIONKINGTRAILER.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నటువంటి మూవీ "ముఫాసా ది లయన్ కింగ్". ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ అయినటువంటి డిస్నీ భారీగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ది లయన్ కింగ్ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో  ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో మరో చిత్రాన్ని తీసుకురాబోతోంది.  ఈ సినిమాలో కెల్విన్ హరిసన్, ఆరోన్ స్టోన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు అనేక సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కీలక పాత్ర అయినటువంటి ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్  తెలుగులో విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు వాయిస్ డైలాగ్స్ అందరినీ  ఫిదా చేస్తున్నాయి.

 "అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.. కానీ అంతలోనే అవి మాయమవుతున్నాయి" అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్ తో ట్రైలర్  క్రేజీగా ఉందని చెప్పవచ్చు. అయితే ముఫాసాకు మహేష్ వాయిస్ ఇవ్వడం ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్నాయి.

అయితే ఈ మూవీని డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.  అయితే ముఫాసా పాత్రకు హిందీలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వాయిస్ ఇస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hollywood mufasa-the-lion-king mahesh-babu-voice mufasa-the-lion-king-trailer

Related Articles