Maheshbabu:మురారి రీ రిలీజ్ రికార్డు స్థాయిలో కలెక్షన్స్.. మహేషా  మజాకా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది  అలనాటి హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నట వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ


Published Aug 04, 2024 02:33:29 PM
postImages/2024-08-04/1722762209_murari.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది  అలనాటి హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నట వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇప్పటికీ ఐదు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ 24ఏళ్ల యువకుడిలా కనిపిస్తూ ఉంటారు. అలాంటి మహేష్ బాబుకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆయన ఏ చిత్రం చేసిన చాలా డిఫరెంట్ కథతో అద్భుతమైన లుక్ లో కనిపిస్తూ ఉంటారు. అలాంటి మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ అయిన మూవీ మురారి. ఈ చిత్రం మరోసారి రిలీజ్ కు సిద్ధమైంది.

 ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారట.  ఈ సినిమా రిలీజ్ కి ముందే అద్భుతమైన టికెట్ల అమ్మకాలు జరిపి రికార్డు క్రియేట్ చేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.  ప్రస్తుతం చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లకు సంబంధించిన  చిత్రాలను వారి బర్త్డేల సందర్భంగా రిలీజ్ చేస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. అలా మహేష్ బాబు పోకిరి నుంచి సినిమాలు వస్తున్నాయి. అలాంటి ఆగస్టు 9వ తేదీన మురారి సినిమా  4k క్వాలిటీతో రిలీజ్ కు సిద్ధమైంది.

 ఇదే తరుణంలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. హైదరాబాదులోని నైజాంలో అడ్వాన్స్ సేల్స్ లో భాగంగా ఫాస్టెస్ట్ 50 లక్షల కలెక్షన్స్ రాబడిన సినిమాల రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా బుక్ మై షోలో  ఒక్కరోజులో  40.01k టికెట్స్ బుక్ అవడంతో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఇంతకుముందు ఇది బిజినెస్ మాన్ సినిమా పేరిట ఉండేది కానీ ఆ రికార్డు తిరగరాసి మురారి దూసుకెళ్లింది. అంతేకాకుండా  మహేష్ బాబు అడ్డాగా ఉండే సుదర్శన్ థియేటర్ లో ఆగస్టు 9న  సినిమా చూడడానికి ఒక్క టికెట్ కూడా మిగలలేదు.  దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబుపై  అభిమానులకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : news-line mahesh-babu krishna murari re-release

Related Articles