అలా పిలవడానికి ఏమైనా అభ్యంతరం ఉంటే ఇంటర్‌వ్యూని ముగించుకొని వెళ్లిపోతానని ఆయన హెచ్చరించారు. 'నాకు ఉన్న పేరు పెట్టి పిలవాలి. కానీ, గాడిద, కుక్క, నక్క అని పిలుస్తారా అని ఆయన నిప్పులు చెరిగారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. తనను రెడ్డి అని పిలవొద్దని నానా హంగమా చేసిన కోదండరాంరెడ్డి.. ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తూ.. కోదండరాం'రెడ్డి' అను నేను అన్నారు.
ఇటీవల న్యూస్ లైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కు అయన ఇంటర్‌వ్యూ ఇచ్చారు. అయితే, కోదండరాంరెడ్డి అంటూ ఆయనను సంభోదించిన జర్నలిస్ట్‌పై కోదండరాం రెడ్డి తీవ్ర ఆర్గహం వ్యక్తం చేశారు. తాను రాసుకున్న పేరుతోనే పిలవాలని ఆయన మండిపడ్డారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు పిలుస్తారా అని ప్రశ్నించారు. తన పేరు కేవలం కోదండరాం మాత్రమేనని ఆయన అన్నారు. అలా పిలవడానికి ఏమైనా అభ్యంతరం ఉంటే ఇంటర్‌వ్యూని ముగించుకొని వెళ్లిపోతానని ఆయన హెచ్చరించారు. 'నాకు ఉన్న పేరు పెట్టి పిలవాలి. కానీ, గాడిద, కుక్క, నక్క అని పిలుస్తారా అని ఆయన నిప్పులు చెరిగారు.
అయితే, తాజగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కోదండరాంరెడ్డి.. తన రెండు నాల్కల దొరణని మరోసారి బయటపెట్టుకున్నారని పలువురు అంటున్నారు.
https://youtu.be/GzEddWfLw10?si=ZYQyYMnpZMLX3wrO