Nagarjuna:తమిళ స్టార్ హీరో చిత్రంలో విలన్ గా నాగార్జున.!

అక్కినేని ఫ్యామిలీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చే హీరో ఏఎన్నార్.  నాగేశ్వరరావు ఇండస్ట్రీలో హీరోగా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీని ఎదిగేలా కూడా చేశారు. అలాంటి ఏఎన్నార్ నట వారసత్వాన్ని


Published Jul 27, 2024 12:42:54 AM
postImages/2024-07-27/1722058946_rajini1.jpg

న్యూస్ లైన్ డెస్క్: అక్కినేని ఫ్యామిలీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చే హీరో ఏఎన్నార్.  నాగేశ్వరరావు ఇండస్ట్రీలో హీరోగా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీని ఎదిగేలా కూడా చేశారు. అలాంటి ఏఎన్నార్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో నాగార్జున కూడా స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటికీ మన్మధుడి లాగే కనిపించే  నాగార్జున ఆరుపదుల వయస్సు దగ్గరికి వస్తున్న సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.

అలాంటి నాగార్జున కేవలం హీరో గానే కాకుండా విలన్ గా కూడా  చేయబోతున్నారు. మరి ఆ సినిమా ఏంటి  పూర్తిగా చూసేద్దాం. చాలావరకు బాలీవుడ్ లోని స్టార్ హీరోలు, టాలీవుడ్ లో కోలీవుడ్ లో విలన్స్ గా చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలా మన టాలీవుడ్ హీరోలు కూడా ఇతర ఇండస్ట్రీలోకి వెళ్లి రకరకాల పాత్రలు చేస్తూ ఉన్నారు.  తాజాగా స్టార్ హీరో నాగార్జున కూడా కోలీవుడ్ లో విలన్ గా చేయడానికి సిద్ధమయ్యారట.

తాజాగా వస్తున్నటువంటి వార్తల ప్రకారం సూపర్ స్టార్ రజినీకాంత్  రాబోయే చిత్రంలో కింగ్ నాగార్జున విలన్ పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే నాగార్జున పాత్రకు చాలా పవర్ ఉంటుందని సమాచారం.  ఈ మూవీ తమిళ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్నరని సమాచారం. అయితే ఈ చిత్రం పేరు 'కూలీ' అని పెట్టారట.  కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో రజనీకాంత్ హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అలాంటి ఈ చిత్రంలో నాగార్జున విలన్ గా చేయబోతున్నారని ఫిలిం నగర్ లో వార్తలు జోరందుకున్నాయి.

newsline-whatsapp-channel
Tags : rajinikanth news-line nagarjuna kollywood lokesh-kanakaraj kooli

Related Articles