Naga Chaitanya: నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్... ఫోటోలు ఇవే...!

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్ మెంట్ అయిపోయింది. ఏడాది పాటు సీక్రెట్ నడిపించిన రిలేషన్ షిప్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు .


Published Aug 08, 2024 02:11:00 PM
postImages/2024-08-08/1723106738_chai.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  అనుకున్నట్టే నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్ మెంట్ అయిపోయింది. ఏడాది పాటు సీక్రెట్ నడిపించిన రిలేషన్ షిప్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు . శోభిత ధూళిపాళ్లతో తాజాగా నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఆ ఫోటోలను కూడా నాగార్జున సోషల్ మీడియాలో విడుదల చేశారు.అంతా అనుకున్నట్లుగానే నాగచైతన్య శోభిత మధ్య రిలేషన్ ఖాయం అయ్యింది. 


నాగ చైతన్య, శోభిత ఇద్దరితో కలిసి ఉన్న ఫోటోను నాగార్జున షేర్ చేశాడు. అయితే.. ఇవాళ ఉదయమే నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇవాళ ఉదయం 9 గంటల 42 నిమిషాలకు ఈ వేడుక జరిగినట్లు తెలిపారు.నాగార్జున కొడుకు ఎంగేజ్ మెంట్ పై ఆసక్తికర ట్వీట్ కూడా చేశారు. నా కొడుకు నిశ్చితార్ధం కుటుంబ సభ్యుల  మధ్య జరిగింది అక్కినేని నాగార్జున తాజాగా కన్ఫర్మ్ చేశారు. శోభితను తమ ఫ్యామిలీలోకి వెల్ కమ్ చేస్తున్నట్లు చెప్పారు.


ఎంగేజ్‌మెంట్ ఫోటోల్లో నాగచైతన్య తెలుపు రంగు డ్రెస్సులో కనిపిస్తే.. శోభిత ధూళిపాళ్ల పింక్ కలర్ శారీలో చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ఇండియాలో తక్కువగా కనిపించిన..బయటదేశాల్లో మాత్రం హ్యాపీ గా తిరిగారు.అప్పట్లో ఈ వార్తలను శోభిత ఖండించింది. మా మధ్య అలాంటిదేం లేదని చెప్పింది. పోనీలే ...ఇప్పుడు నాగచైతన్య, శోభిత ఎంగేజ్ మెంట్ అయిపోయింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna nagachaitanya engagement

Related Articles