సెమినార్ హాల్లో పడుకున్న లేడీ డాక్టర్ పై హాల్లోనే అత్యాచారం చేసి చంపేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనుషులు మారిపోతున్నాయి. పెద్ద ప్రమాదం జరిగితే .. జనాలు చావలేదని మాట్లాడుకుంటున్నారు. పరిస్థితులు అలా మారిపోయాయి. కోల్‌కతాలోని ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ నెల 9న ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి, హత్య కేసు ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. సెమినార్ హాల్లో పడుకున్న లేడీ డాక్టర్ పై హాల్లోనే అత్యాచారం చేసి చంపేశారు.
40 నిమిషాలు పాటు ...తనకు నరకం చూపించి చంపేశారు.. 31 ఏళ్ల బాధితురాలిని చెప్పలేని, రాయలేని విధంగా అత్యాచారానికి తెగబడి, టార్చర్ చేసి మరీ నిందితుడు హత్య చేశాడు. అయితే మరికొందరు మాత్రం ఈ ఇన్సిడెంట్ ను చాలా ఫన్నీ గా తీసుకున్నారు. గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అయితే ఇన్సిడెంట్ కోసం మరింత తెలుసుకోవాలనో ...ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో తెలీదు కాని గూగుల్‌లో దూరిపోయి బాధితురాలి ఫొటోలు, అత్యాచార వీడియోల కోసం తెగ వెతుకుతున్నారు. మరికొంతమందికి ‘వీడియో’, ‘రేప్ వీడియో’ అంటూ టైప్ చేసి గూగుల్ ను ఎలా రేప్ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారట. అంతేకాదు, ‘రేప్ పోర్న్’ అని గాలించారు. గత వారం రోజులుగా ఇంటర్నెట్‌లో ఇదే వెతుకులాట కొనసాగుతోంది. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదంటున్నారు ఓ వర్గం నెటిజన్లు.