తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి ఆదరభిమానాలు ఉంటాయో మనందరికీ తెలుసు. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు స్టార్లుగా ఎదిగారు. అలాంటి
న్యూస్ లైన్ డెస్క్:తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి ఆదరభిమానాలు ఉంటాయో మనందరికీ తెలుసు. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు స్టార్లుగా ఎదిగారు. అలాంటి మెగా ఫ్యామిలీలో హీరోల గురించి పక్కన పెడితే మెగా ఫ్యామిలీ లో ఉన్నటువంటి ఆడపిల్లల్లో నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తోంది. హీరోయిన్ గా చేసిన ఆమెకు కలిసి రాలేదు. దీంతో పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు కూడా తీసుకుంది. వెబ్ సిరీస్, సినిమాలు చేస్తూ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
అలాంటి కొణిదల నిహారిక ప్రొడ్యూసర్ గా వచ్చినటువంటి మూవీ కమిటీ కుర్రాళ్ళు. చిత్రం విడుదలవడానికి ఇప్పటికే సిద్ధమైపోయింది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక చాలా హంగామా చేస్తుంది. అయితే నిహారిక తన ఫ్యామిలీ ఎవరి సపోర్ట్ లేకుండా తన సినిమాలు రిలీజ్ చేసుకొని మంచి ప్రమోషన్స్ అందించి సినిమాని హిట్ చేసుకోవాలని తన సొంత టాలెంట్ తో ఎదగాలని చూస్తుందట. మెగా ఫ్యామిలీపై ఏమాత్రం ఆధారపడకూడదని అనుకున్నదట. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక అక్కినేని ఫ్యామిలీని రంగంలోకి దించుతోందట. అయితే ఈ మూవీ ఆగస్టు 9వ తేదీన థియేటర్లోకి వస్తుండడంతో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ యొక్క ప్రోగ్రామ్ కు గెస్ట్ గా అక్కినేని హీరో నాగచైతన్య రాబోతున్నారని తెలుస్తోంది. దీంతో మెగా హీరోలు అంతమంది ఉండగా అక్కినేని హీరో ఈ ప్రోగ్రాంకు రావడం ఏంటని అందరు అనుమాన పడుతున్నారు. అంతేకాదు మెగా అభిమానులంతా షాక్ అయిపోతున్నారు. కానీ నిహారిక మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ నాగచైతన్యను ఈ ఈవెంట్ కు రమ్మని ఆహ్వానం పలికిందట. తండేల్ సినిమా షూటింగ్ లో ఉన్నటువంటి చైతు నిహారిక కోసం వస్తారా రారా అనేది ముందు ముందు తెలుస్తుంది.