Devara : దేవర రెండోపాట.. ముద్దొస్తున్న జాన్వీ.. ఆ డ్రెస్ లో ఎన్టీఆర్

సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న దేవర నుంచి వచ్చిన చుట్టమల్లె సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది.


Published Aug 05, 2024 07:53:36 AM
postImages/2024-08-05/1722860967_DevarasecondSong.jpg

 

న్యూస్ లైన్ డెస్క్ : కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ మూవీ దేవర మీద అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్.. ‘దూకే ధైర్యమ జాగ్రత్తా’ అంటూ సాగే పాట శ్రోతలను.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. సోషల్ మీడియాలో రీల్స్ అయితే లెక్కే లేదు. అయితే.. కొన్ని రోజులుగా రెండో సాంగ్ మెలోడీ అంటూ లీకులిచ్చిన టీమ్.. తాజాగా ఆ పాటను విడుదల చేసింది.

 

సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న దేవర నుంచి వచ్చిన చుట్టమల్లె సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా రిలీజ్ అయిన ఈ పాట కూల్ కూల్ గా సాగిపోతూ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో జాన్వీ, ఎన్టీఆర్ ల జంట చూపు తిప్పుకోనివ్వలేదు. డిఫరెంట్ షర్ట్ లో ఎన్టీఆర్.. అందాలు ఆరబోస్తూ జాన్వీ కపూర్  మెస్మరైజ్ చేశారు.

 

 

newsline-whatsapp-channel
Tags : jr-ntr release movies movie-news new-movie devara latest-news news-updates telugu-news

Related Articles