డ్యూయల్ రోల్ కాదు..త్రిపుల్ రోల్ లో కూడా మెప్పించిన తెలుగు హీరోలు.!

సినిమా ఇండస్ట్రీలో కెమెరా ముందు నటించడం అంటేనే ఎంతో కష్టమైన పని. ఒక సీన్ తీయాలంటే దానికి దర్శకనిర్మాతలు హీరోలు ఎంత కష్టపడతారో చెప్పడం కష్టం.  అలాంటిది ఓకే హీరో డబల్ రోల్


Published Sep 06, 2024 08:33:15 AM
postImages/2024-09-06/1725591795_tolly.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో కెమెరా ముందు నటించడం అంటేనే ఎంతో కష్టమైన పని. ఒక సీన్ తీయాలంటే దానికి దర్శకనిర్మాతలు హీరోలు ఎంత కష్టపడతారో చెప్పడం కష్టం.  అలాంటిది ఓకే హీరో డబల్ రోల్ లో ఎంత కష్టపడలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఒక హీరో ట్రిపుల్ రోల్ లో చేస్తే  ఇక ఆ కష్టాన్ని మాటల్లో చెప్పలేం. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు నుంచి మొదలు  ఇప్పటి హీరోల వరకు త్రిపుల్ రోల్ లో చేసిన వారెవరు ఇప్పుడు తెలుసుకుందాం.

Sr.Ntr
 అన్న ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన ఒక రోల్ మోడల్. ఆయన ఇండస్ట్రీలో చేయని పాత్ర లేదు  చేయని కథ లేదు. అలాంటి ఎన్టీఆర్ కేవలం ఈ పాత్రలోనే కాకుండా త్రిపాత్రాభినయం కూడా చేశారు. దానవీరశూరకర్ణ చిత్రంలో ఈ చిత్రానికి దర్శకత్వం ఎన్టీఆర్ వహించారు.  10 లక్షలతో తెరకెక్కిన ఈ మూవీ రెండు కోట్లు వసూలు చేసింది. 

 ఏఎన్ఆర్ :
 ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పిల్లర్ ఎన్టీఆర్ అయితే మరో పిల్లర్ ఏఎన్ఆర్ అని చెప్పవచ్చు. ఈయన ఇండస్ట్రీలో చేయని పాత్ర లేదు. అలాంటి ఏఎన్నార్ ఇండస్ట్రీలో ఏకంగా తొమ్మిది పాత్రలు ఉండే రోల్ చేశారు. ఇంతకీ ఆచిత్రం ఏంటంటే నవరాత్రి. ఇందులో ఏఎన్ఆర్ సరసాన సావిత్రి నటించారు. 

 సూపర్ స్టార్ కృష్ణ:
 తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరు రెండు కళ్ళలాంటి వారైతే వారికి చేదోడు వాదోడుగా ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ.  తెలుగు సినిమాకు కొత్తదనాన్ని పరిచయం చేసింది కృష్ణ అని కూడా చెప్పవచ్చు. అలాంటి ఈయన ఎన్నో సినిమాల్లో త్రిపుల్ రోల్ చేశారు.  కుమార రాజా, బంగారు కాపురం, రక్తసంబంధం ఇలా ఎన్నో చిత్రాలు ఉన్నాయి. 

 శోభన్ బాబు:
 తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోగ్గాడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు శోభన్ బాబు. ఈయన అందానికి అప్పట్లో అమ్మాయిలు ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అలాంటి శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో కూడా త్రిపుల్ రోల్ లో నటించారు.

 మెగాస్టార్:
 తెలుగు సినిమా ఇండస్ట్రీలో  పెద్ద స్టార్ గా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈయన కూడా ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో త్రిబుల్ రోల్  చేశారు. 

 బాలకృష్ణ:
 నాన్న ఎన్టీఆర్ నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని బాలకృష్ణ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు. అలాంటి బాలయ్య డ్యూయల్ రోల్ లో ఎన్నో సినిమాలు చేశారు. అలాంటి బాలకృష్ణ అధినాయకుడు సినిమాలో త్రిపుల్ రోల్ లో చేశారు. 

 జూనియర్ ఎన్టీఆర్:
 నందమూరి ఫ్యామిలీలో ఈతరం హీరోలలో జూనియర్ ఎన్టీఆర్  పాన్ ఇండియా స్టార్ అయ్యారు.  అలాంటి ఈయన జై లవకుశ చిత్రంలో త్రిపుల్ రోల్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi news-line jr-ntr sr-ntr balakrishna anr shobanbabu

Related Articles