Pawan:పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు కష్టమేనట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. చూడటానికి సన్నగా కరెంటు తీగలా ఉండే పవన్ కళ్యాణ్ నటన మాత్రం అమోఘంగా


Published Aug 17, 2024 04:45:00 PM
postImages/2024-08-17/1723891895_pawan.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. చూడటానికి సన్నగా కరెంటు తీగలా ఉండే పవన్ కళ్యాణ్ నటన మాత్రం అమోఘంగా ఉంటుంది. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ  మరో లెవెల్ అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణమిచ్చే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ విధంగా సినిమాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్  రాజకీయాల్లో కూడా పార్టీ స్థాపించి దూసుకుపోతున్నారు.  అలాంటి పవన్ కళ్యాణ్ కెరియర్ లో అద్భుతమైన హిట్ సాధించిన మూవీ ఖుషి.  ఈ చిత్రాన్ని ఎస్ జె సూర్య  డైరెక్షన్ చేశారు.

అలాంటి ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ ల గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. నేను పవన్ కళ్యాణ్ కోసం కృషి సినిమా తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా కథ రాశాను. ఆ టైంలోనే తెలుగు పూర్తిగా నేర్చుకున్నాను. ఇది కూడా ఖుషి లాగా మంచి లవ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ కి కూడా కథ బాగా నచ్చింది.

 ఆయన అప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంతో రెండేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు ప్రారంభిద్దామని చెప్పారు. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత కోనేళ్ళకు  పవన్ ను కలిసి లవ్ స్టోరీ సినిమా చేస్తానని చెప్పారట. దీంతో పవన్ కళ్యాణ్ ఇక నేను లవ్ సినిమాలు చేయనని  డైరెక్ట్ గా చెప్పేసారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీ అయిపోయారు  ఆయన చేయాలనుకున్నటువంటి హరహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలు షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో  బిజీ అయిపోయారు.

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu kushi movies love-story sj-surya

Related Articles