Drugs: సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి దగ్గర భారీగా డ్రగ్స్.. అరెస్ట్


Published Sep 01, 2024 12:46:15 PM
postImages/2024-09-01/1725174975_IMG20240901124219640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్ : హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా ఆగడాలు ఆగడం లేదు. పోలీసులు నిత్యం సోదాలు చేస్తున్నా.. ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా డ్రగ్ మాఫియా మాత్రం తమ కార్యకలాపాలు సాగిస్తునే ఉంది. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి దగ్గర భారీగా డ్రగ్స్ దొరికాయి. వివరాల్లోకి వెళితే..

సినీ పరిశ్రమకు చెందిన నరసింహరాజు గత కొన్ని రోజులుగా డ్రగ్స్ తయారు చేస్తూ ఇండస్ట్రీలోని పలువురికి అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కూకట్ పల్లిలోని నరసింహ రాజు నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పోలీసులకు రెండున్నర కిలోలకుపైగా ఎండీఎంఏ డ్రగ్స్‌ దొరికాయి. గత కొన్నాళ్ల నుంచి నరసింహ రాజు డ్రగ్స్‌ తయారు చేస్తూ సినీ ఇండస్ట్రీలోని పలువురు నటులకు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

newsline-whatsapp-channel
Tags : telangana hyderabad police movie-news crime- crime drugs latest-news news-updates

Related Articles