AP: పూనమ్ సంచలన పోస్ట్.. టార్గెట్ పవన్ కళ్యాణ్..?

గతంలో ఆమె పెట్టిన ప్రతి పోస్ట్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లింక్ పెట్టి. ఆయన కోసమే పూనమ్ కామెంట్ చేసిందని వార్తలు వచ్చేవి. లీడర్లు డీల్ చేయలేరు.. డీలర్లు లీడ్ చేయరంటూ పూనమ్ పోస్ట్ పెట్టారు.
 


Published Sep 03, 2024 02:16:03 PM
postImages/2024-09-03/1725353163_punamtweet.jpg

న్యూస్ లైన్ డెస్క్: గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించని సినీ నటి పూనమ్ కౌర్.. తాజాగా, తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టడం ప్రారంభించింది. గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయంటూ జరిగిన ఆందోళనపై కూడా ఆమె స్పందించింది. ఆడపిల్లలకు ఇటువంటి చేదు అనుభవం ఎదురవడం దురదృష్టకరమని ఆమె పోస్ట్ పెట్టింది. వెనకడుగు వేయకుండా ధైర్యంగా పోరాడాలని ఆమె సూచించింది.

తాజగా, ఏపీలో సంక్షోభ పరిస్థితులపై స్పందిస్తూ.. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో పట్టించుకోకుండా మౌనంగా ఉండే నాయకులను అవకాశవాదులని, మాట మీద నిలబడడం వారికి చేతకాదంటూ పూనమ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గతంలో ఆమె పెట్టిన ప్రతి పోస్ట్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లింక్ పెట్టి.. ఆయన కోసమే పూనమ్ కామెంట్ చేసిందని వార్తలు వచ్చేవి. లీడర్లు డీల్ చేయలేరు.. డీలర్లు లీడ్ చేయరంటూ పూనమ్ పోస్ట్ పెట్టారు.

పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే పూనమ్ ఆ పోస్టులు పెట్టారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో భారీ విపత్తు సంభవించడంపై డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఒక్కసారి కూడా స్పందించలేదు. దీంతో మాట మీద నిలబడలేని నాయకులు, అవకాశ వాదులు అంటూ పూనమ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మాట మీద నిలబడ లేని నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే పూనమ్ ఆ పోస్ట్ పెట్టిందా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : ap-news pawankalyan andhrapradesh news-line newslinetelugu pawan-kalyan appolitics telanganam ap

Related Articles