Prabhas: మాజీ లవర్ తో రొమాన్స్ చేయబోతున్న ప్రభాస్.?

కల్కి మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో జోరు మీదున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు.ఇప్పటికే ది రాజా సాబ్ సినిమా నుండి అప్డేట్ ఇచ్చిన ఈయన త్వరలోనే స్పిరిట్ అలాగే,హను 


Published Aug 05, 2024 03:56:00 PM
postImages/2024-08-05/1722851748_prabhas.jpg

న్యూస్ లైన్ డెస్క్: కల్కి మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో జోరు మీదున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు.ఇప్పటికే ది రాజా సాబ్ సినిమా నుండి అప్డేట్ ఇచ్చిన ఈయన త్వరలోనే స్పిరిట్ అలాగే,హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారట. ఇక ప్రస్తుతం అందరి చూపు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ మూవీ పైనే ఉంది.

ఎందుకంటే యానిమల్ మూవీ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ లో ఒక ఆసక్తి అయితే నెలకొంది. అయితే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించాలని సందీప్ రెడ్డి నిర్ణయించుకున్నారట.అయితే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న ప్రభాస్ కి భార్య పాత్రలో చాలా డిగ్నిఫైడ్ గా ఉండే ఒక హీరోయిన్ ని తీసుకోవాలి అని అనుకుంటున్నారట.

అయితే ఇప్పటికే ప్రభాస్ తో నటించిన అందరికీ తెలిసిన హీరోయిన్ అయితే బాగుంటుంది అని నిర్ణయం తీసుకోవడంతో ఆయన మైండ్ లోకి హీరోయిన్ త్రిష వచ్చిందట.అయితే ప్రస్తుతం త్రిష ఏజ్ మీద పడ్డా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. దీంతో ఈ హీరోయిన్ ని తన సినిమాలో తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అయితే ప్రభాస్ త్రిషలు మాజీ లవర్స్ అనే సంగతి మనకు తెలిసిందే.

ప్రభాస్ త్రిష కాంబినేషన్లో ఇప్పటికే పౌర్ణమి, వర్షం, బుజ్జిగాడు వంటి మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక వీరిద్దరూ అప్పట్లో ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అనే రూమర్ కూడా టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో వినిపించింది. అయితే అలాంటి మాజీ లవర్స్ ని సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో స్పందిప్ రెడ్డి వంగా త్రిషని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు కానీ ప్రభాస్ లేదా త్రిషలు దీనికి ఒప్పుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్, త్రిష కాంబినేషన్లో వచ్చే  రొమాన్స్ మరొకసారి అభిమానులకు కన్నుల పండగే అని చెప్పుకోవచ్చు

newsline-whatsapp-channel
Tags : prabhas kalki-2898-ad newslinetelugu spirit sandeep-reddy-vanga trisha hanu-raghavapudi

Related Articles