Prabhas: ప్రభాస్ చాలా బద్ధకస్తుడు.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్.!

ప్రభాస్ పాన్ వరల్డ్ స్థాయిలో ఎంతో గుర్తింపు పొందిన హీరో. అలాంటి ఈయన మొదట్లో ఇండస్ట్రీకి  ఈశ్వర్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.  ప్రభాస్ చాలా హైట్ ఉండడంతో  సరైన డాన్స్ వచ్చేది కాదు. అంతేకాకుండా అతని 


Published Aug 08, 2024 02:50:00 PM
postImages/2024-08-08/1723106913_rajamouliprabha.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రభాస్ పాన్ వరల్డ్ స్థాయిలో ఎంతో గుర్తింపు పొందిన హీరో. అలాంటి ఈయన మొదట్లో ఇండస్ట్రీకి  ఈశ్వర్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.  ప్రభాస్ చాలా హైట్ ఉండడంతో  సరైన డాన్స్ వచ్చేది కాదు. అంతేకాకుండా అతని లుక్స్ కూడా బాడీకి తగ్గట్టు ఉండేవి కావు. తర్వాత వచ్చిన చిత్రాలు ఫ్లాప్ అయిపోయాయి.  దీంతో ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతల వెనకడుగు వేశారు.

అలా ప్రభాస్ ముందుకు వెళుతున్న తరుణంలో  డైరెక్టర్ రాజమౌళి చేతిలో పడి ప్రభాస్ చత్రపతి సినిమా ద్వారా  బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక అప్పుడు మొదలైన వీరి కాంబినేషన్ బాహుబలి ద్వారా మరో ముందడుగు పడింది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తీసి అద్భుతమైన హిట్ అందుకున్నాడు. దీంతో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ గా ఎదిగారు.  దీని తర్వాత బాహుబలి 2 కూడా అద్భుతంగా హిట్ అయింది.

దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా 100 కోట్లకు పైగా పెరిగింది. ప్రస్తుతం ఈయన తో సినిమాల కోసం దర్శక నిర్మాతలు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు.  అలాంటి ప్రభాస్ తాజాగా నటించి విడుదలైన చిత్రం కల్కి మూవీ కూడా అద్భుతమైన హిట్ సాధించింది. అయితే ఈ చిత్రం తర్వాత ఆయనకు వరుసగా ఎన్నో సినిమాలు ఉన్నాయి. అలాంటి ప్రభాస్ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ప్రభాస్ గురించి ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

 ప్రభాస్ సినీ కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి స్పీడుతో దూసుకుపోతారు. ప్రభాస్ నటన గురించి ఒక్క మాట కూడా తప్పుగా చెప్పడానికి లేదు.  అద్భుతమైన నటుడు అంటూ చెప్పుకోచ్చారు.  కానీ సొంత జీవితంలోనే చాలా బద్ధకస్తుడు, తన సొంత పనులు కూడా ఆయన చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే కనీసం  మైక్ పట్టుకోడానికి కూడా  బద్ధకం అని చూపిస్తాడు. ఈ విధంగా ప్రభాస్ గురించి రాజమౌళి ఈ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : prabhas kalki-2898-ad newslinetelugu rajamouli bahubali chatrapathi

Related Articles