Prabhas: ఎక్కడ ..అవమానపడ్డాడో ..అక్కడే గెలిచాడు అది ప్రభాస్ రేంజ్

ప్రభాస్ ను ఇండియా అంతా స్టార్ అన్నారు కాని నేపాల్ మాత్రం ప్రభాస్ ఆదిపురుష్ ను మాత్రం నేపాల్ దగ్గరకు రానివ్వలేదు.


Published Jul 30, 2024 03:37:02 AM
postImages/2024-07-30/1722328606_maxresdefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  ప్రభాస్ ను ఇండియా అంతా స్టార్ అన్నారు కాని నేపాల్ మాత్రం ప్రభాస్ ఆదిపురుష్ ను మాత్రం నేపాల్ దగ్గరకు రానివ్వలేదు. అదే దేశంలో కల్కి 2898 ఏడీ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. కల్కి ఇప్పటి వరకు దాదాపు 11 వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు.


ఇదిలా ఉండగా.. తన సినిమా బ్యాన్ చేసిన దేశంలో కల్కితో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అవును.. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను నేపాల్ లో బ్యాన్ చేశారు. రామాయణాన్ని వక్రీకరిస్తున్నారంటు ఏవో రీజన్స్ చెప్పి నేపాల్ లో ఆదిపురుష్ ను రిలీజ్ కానివ్వలేదు.


కానీ ఇప్పుడు అదే నేపాల్ లో కల్కి మూవీలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఎక్కడైతే తన సినిమాను బ్యాన్ చేశారో.. అక్కడే ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క సినిమాను ఆపితే.. మా హీరో మరో మూవీతో మీ ఇండస్ట్రీని షేక్ చేస్తాడు అంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
 

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu kalki nepal

Related Articles