MOVIES: ప్ర‌భుదేవా-న‌య‌న‌తార అందుకే విడిపోయారట

ప్రభుదేవా, నయనతార రిలేషన్ షిప్ పెళ్లిపీటలు కూడా ఎక్కాలనుకున్నారు. కాని వర్కవుట్ కాలేదు. అఫిషియల్ గా బ్రేకప్ అనౌన్స్ చేసేశారు


Published Aug 18, 2024 03:46:00 PM
postImages/2024-08-18/1723976285_article2018720511103540235000.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతారనే. అయితే నయన్ కు విఘ్నేష్ తో పెళ్లికి ముందే రెండు సీరియస్ బ్రేకప్స్ అయ్యాయని తెలుసుగా. అందులో ప్రభుదేవా, నయనతార రిలేషన్ షిప్ పెళ్లిపీటలు కూడా ఎక్కాలనుకున్నారు. కాని వర్కవుట్ కాలేదు. అఫిషియల్ గా బ్రేకప్ అనౌన్స్ చేసేశారు కాని ..ఎందుకు విడిపోయారో పబ్లిక్ ఎందుకు చెప్తారు..కాని కొన్ని రీజన్స్ మాత్రం ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి.


ప్రభుదేవా తీరు వల్లే వీరిద్దరు విడిపోయారని తెలుస్తోంది. క్రిస్టియన్‌గా ఉన్న నయనతార‌ను అందుకు న‌య‌నతార అంగీకరించారట. అలాగే పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేయాల‌ని.. హౌస్ వైఫ్ గా మారిపోవాల‌ని ప్ర‌భుదేవా కండీష‌న్ పెట్టాడ‌ట‌. అయితే అందుకు మాత్రం న‌య‌న‌తార ఒప్పుకోలేదు. యాక్టింగ్ మానేస్తే తన ఐడెంటిటీని మిస్ అయిపోతానని చెప్పినా ..వినలేదట. సినిమా  ఇండస్ట్రీకి దూరంగా వస్తేనే తను పెళ్లి చేసుకుంటానని చెప్తే నయన్ ప్రభుదేవాను లైట్ తీసుకుంది.


ప్ర‌భుదేవాతో విడిపోయిన కొన్నేళ్ల‌కు న‌య‌న‌తార కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌తో ల‌వ్‌లో ప‌డింది. ఆరేళ్లు రిలేష‌న్‌లో ఉన్న ఈ జంట‌.. 2002లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. స‌రోగ‌తి ప‌ద్ధ‌తిలో ఇద్ద‌రు క‌వ‌ల మ‌గ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. నయన్ ఇప్పుడు సూపర్ బిజీగా కెరియర్ లో ఉంటూనే..ఫ్యామిలీ లైఫ్ ను కూడా హ్యపీగా ఎంజాయ్ చేస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news love-story nayanthara

Related Articles