Saripoda Shanivaram : సరిపోదా శనివారంలో.. నాని కంటే ఆ పాత్రే హైలెటా?

నాని నటించిన తాజా మూవీ ‘సరిపోదా శనివారం’ ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు పెంచాయి.


Published Aug 20, 2024 02:33:10 PM
postImages/2024-08-20/1724144590_saripodaShanivaram.jpg

న్యూస్ లైన్ డెస్క్ : నాని నటించిన తాజా మూవీ ‘సరిపోదా శనివారం’ ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు పెంచాయి. పానిండియా రేంజ్ లో సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఇతర భాషల్లో సైతం సినిమాను ప్రమోట్ చేస్తూ మూవీ యూనిట్ బిజీబిజీగా ఉ:ది. అయితే.. సినిమా కథకు సంబంధించి ఓ వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ పాత్ర సరిపోదా శనివారం సినిమాకే హైలెట్ గా నిలవనుందట. చారులత అనే లేడీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్న ప్రియాంక మోహన్ కథను కీలక మలుపు తిప్పుతుందట. అందుకే ఆమె పాత్రను ఇప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయలేదని టాక్. ట్రైలర్ లో సైతం ఒకే ఒక డైలాగ్ ఇచ్చింది కూడా ఇందుకేనట. వివేక్ ఆత్రేయ సినిమాల్లో కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. ఈ సినిమాలో కూడా కథ మొత్తం హీరోయిన్ చుట్టే తిరుగుతుందని టాక్. ఇందులో నిజమెంత అనేది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line tollywood movie-news nani news-updates telugu-news heronani

Related Articles