Rajeevkanakala:నా కూతురును అలా చేశారు..సూసైడ్ దాకా.?

రాజీవ్ కనకాల  తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు పొందారు. అలాంటి రాజీవ్ కనకాల  భార్య సుమ కనకాల. ఇక ఈమె  గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా


Published Jul 28, 2024 04:32:02 AM
postImages/2024-07-28/1722159110_kanakala.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాజీవ్ కనకాల  తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు పొందారు. అలాంటి రాజీవ్ కనకాల  భార్య సుమ కనకాల. ఇక ఈమె  గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ కు ఉండేటువంటి పేరు ఈమెకు ఉంటుంది. అలా అని ఈమె పెద్ద స్టార్ నటి కూడా కాదు.  కానీ తనదైన యాంకరింగ్ తో తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంది. అలాంటి సుమ కనకాల మైకు పట్టిందంటే చాలు  అది ఎలాంటి షో అయినా సరే నవ్వులు విరబూయాల్సిందే. అలా తెలుగు ఇండస్ట్రీలో ఉండేటువంటి యాంకర్లు అందరిలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. అలాంటి ఈ ఫ్యామిలీ కూడా విపరీతమైనటువంటి ట్రోలింగ్ ఎదుర్కొందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

సినిమా ఇండస్ట్రీలో నటీనటులపై ట్రోలింగ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మితిమీరిపోయి అసత్య విషయాలను కూడా వారి పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి మరీ గెలికేస్తారు. ఇలాంటి వారిపై మూవీ ఆర్టిస్టు మా అసోసియేషన్ కూడా కఠిన చర్యలు తీసుకుంటున్న ఇవి ఆగడం లేదు. అలా రాజీవ్ ఫ్యామిలీని కూడా  గెలిచేసారట. ఈ విషయాన్ని రాజీవ్ కనకాల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఓసారి నేను ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా నాన్న గురించి మాట్లాడుతూ.. ఆయన సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అని చెప్పాను. వాళ్లు దాన్ని చక్కగా ఎడిట్ చేసి పబ్లిష్ చేశారు. కానీ దాని అనుబంధ ఛానల్ మాత్రం నా ఇంటర్వ్యూను ముక్కలు ముక్కలుగా చేసి ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేశారు.. ఇందులో ఒక వీడియోకి థంబ్ నైల్   సూసైడ్ చేసుకొని మరణించిన దేవదాస్ కనకాల అని పెట్టారు. ఆ థంబ్ చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ రిపోర్టర్ కి కాల్ చేసి  ఎడాపెడా వాయించాను.

అతను సారీ చెప్పి థంబ్ మార్చాడు. అంతేకాకుండా సుమ నేను విడాకులు తీసుకున్నామని అనేక వార్తలు క్రియేట్ చేశారు. చివరికి జనాలు కూడా నమ్మేశారు.  అలా మా పర్సనల్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన వీరు నా  కూతురు లైఫ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఇబ్బందులకు గురి చేశారు.. నా కూతుర్ ని దారుణంగా ట్రోల్ చేసేసారు. ఆమె ఒక ఫంక్షన్ కి వెళ్లి వస్తూ ఉంటే ఆమె ఎక్కడికో వెళ్లి వస్తుందని సుమా రాజీవ్ కనకాల కూతురు అలా ఇలా అంటూ వార్తలు రాసేశారు. దయచేసి అలాంటివి రాయకండి మా పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులకు గురి చేయకండి అంటూ రాజీవ్ కనకాల విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu trolling suma-kanakala rajeev-kanakala

Related Articles